గుంటూరు పార్లమెంటు : ' పెమ్మసాని ' భారీ మెజార్టీ మీదే లెక్కలు...?
- రాజధాని ప్రభావం.. పెమ్మసాని క్రేజ్ టీడీపీకి ప్లస్
- మంగళగిరి, తాడికొండ సెగ్మెంట్ల నుంచి టీడీపీకి భారీ మెజార్టీ పక్కా..?
( అమరావతి - ఇండియా హెరాల్డ్ )
పెమ్మసాని చంద్రశేఖర్ ఎప్పుడు అయితే గుంటూరు పార్లమెంటు సీటుకు టీడీపీ అభ్యర్థిగా సెలక్ట్ అయ్యారో అప్పటి నుంచి ఆ పేరు తెలుగు మీడియాలో ఒక్కసారిగా ప్రకంపనలు రేపడం స్టార్ట్ అయ్యింది. గుంటూరు జిల్లాలోని తెనాలి నియోజకవర్గం బుర్రిపాలెం గ్రామానికి చెందిన పెమ్మసాని అమెరికాలో డాక్టర్ వృత్తిలో రాణించడంతో పాటు అక్కడ వైద్య పరీక్షలకు ప్రిపేర్ అయ్యే వారికి కోచింగ్ రంగంలో నిష్ణాతులు అవ్వడంతో పాటు తిరుగులేని విధంగా సక్సెస్ అయ్యారు.
పేరు ఖరారు అయినప్పటి నుంచే పెమ్మసాని గెలుపు ఖాయం అంటూ అన్ని సర్వేలు ఓపెన్‌గా చెప్పేస్తున్నాయి. వైసీపీ సానుకూల మీడియా కావచ్చు.. వైసీపీ అనుకూల సర్వేలు కావచ్చు.. అన్నీ కూడా పెమ్మసాని చంద్రశేఖర్ గుంటూరు ఎంపీగా విజయం సాధించడం పక్కా అని నొక్కి వక్కాణిస్తున్నాయి. జగన్ ఇక్కడ కమ్మలకు యాంటీగా కావాలనే కాపు వర్గానికి చెందిన కిలారు వెంకట రోశయ్యకు ఎంపీ సీటు ఇచ్చారు. రోశయ్య గత ఎన్నికల్లో పొన్నూరులోనే చావు తప్పి కన్నులొట్టబోయిన చందంగా కేవలం వెయ్యి ఓట్ల స్వల్ప తేడాతో గెలిచారు.
ఐదేళ్లలో అక్కడ రోశయ్యకు కావాల్సినంత వ్యతిరేకత వచ్చేసింది. పొన్నూరులోనే చెల్లని రోశయ్యను ఇప్పుడు గుంటూరు పార్లమెంటుకు జగన్ పంపడం వెనక కేవలం రోశయ్య కాపు అని మాత్రమే.. ఈ ఈక్వేషన్‌తోనే జగన్ ఈ ప్లాన్ వేశారు. నియోజకవర్గంలో 2 లక్షల కాపులు, 2 లక్షల కమ్మలు, 1.80 ముస్లింలు, 2 లక్షల మాలల ఓట్లు ఉన్నాయి. కాపు, ముస్లిం, మాల ఈక్వేషన్‌తో ఓట్లన్నీ వైసీపీకే పడతాయన్నది జగన్ అంచనా. కానీ రాజధాని అమరావతి మార్పు ప్రభావంతో ఈ ప్రాంతంలో రైతులతో పాటు సాధారణ ప్రజల జీవన ప్రమాణాలు దారుణంగా దెబ్బతిన్నాయి.
అసలు ఇప్పుడున్న పరిస్థితుల్లో గుంటూరు పార్లమెంటు ఓటరు కులాలో లేదా క్యాండెట్‌ను చూసి ఓటేయడం కన్నా వైసీపీకి వ్యతిరేకంగా ఓటేస్తారన్న భావన కూడా ఉంది. పైగా టీడీపీకి పెమ్మసాని రూపంలో బలమైన అభ్యర్థి దొరకడం కూడా చాలా ప్లస్ అయ్యింది. ఇదే పార్లమెంటు పరిధిలో మంగళగిరి నియోజకవర్గం కూడా ఉంది. అక్కడ లోకేష్ ఈ సారి భారీ మెజార్టీతో గెలవడం పక్కా అంటున్నారు. ఇక తాడికొండ కూడా ఈ పార్లమెంటు పరిధిలోనిదే.. ఓవరాల్‌గా పెమ్మసాని గెలుపు విషయంలో వన్‌సైడ్ విక్టరీయే అని.. మెజార్టీ లక్ష దాటుతుందా.. అది 2 కు వెళుతుందా అన్న చర్చలు టీడీపీలో.. ఇటు ఆ మెజార్టీని ఎంతకు తగ్గిస్తాం అన్న టాక్ వైసీపీలో నడుస్తోంది.