ఏపీ:రాజకీయ చదరంగంలో చిక్కుకున్న వృద్ధులు..!

Pandrala Sravanthi
ఏ ప్రాంతంలో చూసిన ఏమున్నది గర్వ కారణం రాజకీయ చదరంగంలో చిక్కుకునేది పేద జనం అన్నట్టుంది ప్రస్తుత ఏపీ రాజకీయ పరిస్థితులు. వైసిపి, టిడిపి చేస్తున్నటువంటి ఈ రాజకీయ ఆటలో నాయకుల కుటుంబాలు బలవడం లేదు. ధనవంతులు బలవడం లేదు. కేవలం పింఛన్ పై బ్రతికే వృద్ధులు మాత్రమే బలవుతున్నారు. రెండు పార్టీల్లో ఎవరో ఒకరు  గెలుస్తారు, మరొకరు ఓడతారు. ఎవరు గెలిచినా ఎవరు ఓడిన వారు చేసేది ప్రజాసేవే. కానీ ప్రజల మెప్పు పొందడం కోసం వారు గద్దెనెక్కడం కోసం ప్రజల ప్రాణాలను పణంగా పెడుతున్నారు. ఆలోచన లేని నిర్ణయాల వల్ల ఏపీలో వృద్ధులు పండుటాకుల్లా రాలుతున్నారు. దీనికి కారకులు ఎవరు.. ఆ వృద్ధుల కుటుంబానికి భరోసా ఎవరు అనేది చూద్దాం..


 బాబే ఈ పింఛన్ దారులు చనిపోవడానికి కారకుడు అంటూ జగన్ ఆరోపిస్తున్నాడు. మొన్న సచివాలయం కెళ్ళి 30 మంది చనిపోవడం, ప్రస్తుతం బ్యాంకులోకి వెళ్లి చనిపోవడానికి అయినా  కారణం చంద్రబాబు అని  జగన్మోహన్ రెడ్డి ఆరోపిస్తూ ముందుకు వెళ్తున్నారు. ప్రభుత్వ హయాంలో పని చేసే వాలంటీర్లను వాళ్ళ పని వాళ్ళని చేసుకొనివ్వకుండా, వాళ్లు వైసిపి కార్యకర్తలు అని వాళ్ళు ప్రకటించడంతో  ఈ గొడవ మొదలైంది. అంతేకాకుండా రాజకీయ పార్టీలు ఆ కార్యకర్తలను తీసుకెళ్లి వాలంటీర్లుగా కొనసాగించడం, వాళ్లని ప్రచారానికి వాడుకునే ప్రయత్నం చేయడం  అనేది జగన్ చేసినటువంటి పెద్ద మిస్టేక్. అక్కడ మొదలైంది ప్రధాన సమస్య..దీంతో ప్రతిపక్షాలు వాలంటీర్ల వ్యవస్థ పై తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేశారు.


వాలంటీర్లను రాజకీయాల్లోకి లాగితే  ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తాయని జగన్ కు ముందు తెలియదా.? తెలిసే అలా చేశారా అనేది ప్రస్తుతం ప్రజలు ఆలోచించాలి. ఇందులో ప్రతిపక్ష మైనటువంటి చంద్రబాబు నాయుడు కూడా కాస్త ఆలోచన చేయాలి. వాలంటీర్లు ఆ పార్టీకి ఓటు వేయమని వెళ్లి అడగగానే ప్రజలు ఓటేస్తారా? అలాంటప్పుడు మీ టిడిపి కార్యకర్త వెళ్లి కూడా ఓటేయమని అడిగితే వెయ్యాలి కదా.? అంత ఈజీగా ప్రజలు వాలంటీర్లు చెబితే ఓటు వేసే పరిస్థితి ప్రస్తుత కాలంలో లేదు. ఈ విధంగా వైసిపి, టిడిపి నాయకులు చేసినటువంటి పెద్ద మిస్టేక్ వల్ల పోయిన నెలలో 31 మంది, ఈ నెలలో పదిమంది వృద్ధుల మరణానికి కారకులయ్యారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: