జిల్లాలు దాటి పోటీ చేస్తున్న బీజేపీ నేత..రచ్చ గెలుస్తారా..?

Divya
* భార్య సామాజిక వర్గమే సత్య కుమార్ కు కలిసొచ్చిందా..
•కేతిరెడ్డి ఓటమి ధ్యేయంగా కూటమి
* నాన్ లోకల్ అయినా సత్యకుమార్ రచ్చ గెలుస్తారా..
ఆంధ్రప్రదేశ్లో అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికలకు కేవలం వారం రోజులు మాత్రమే మిగిలి ఉంది.. ఈ సమయంలో నువ్వా? నేనా? అంటూ అభ్యర్థులు పోటీపడుతూ ఎలాగైనా సరే అధికారంలోకి రావాలని ప్రజలతో మమేకమవుతూ తమ వంతు ప్రచారాలు నిర్వహిస్తున్నారు. ఈ క్రమంలోని ఇక్కడ కొన్ని నియోజకవర్గాలలో లోకల్ నాన్ లోకల్ అనే సమస్య ఎదురవుతోంది.. సిట్టింగ్ ఎమ్మెల్యేలను కాదని ఇతర నియోజకవర్గాలకు చెందిన నేతలను అభ్యర్థులుగా ప్రకటించి.. ఏ నియోజకవర్గమైన సరే తాము గెలుస్తామంటూ ధీమా వ్యక్తం చేస్తున్నారు . ఈ క్రమంలోనే ధర్మవరం నియోజకవర్గంలో కూడా లోకల్ నాన్ లోకల్ అనే సమస్య ఎదురవుతోంది..
బిజెపిలో కీలక నేతగా వ్యవహరించి ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన సత్య కుమార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నియోజకవర్గానికి చెందిన వ్యక్తి. బీసీలో బలమైన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. భారీ సామాజిక వర్గమైన కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తి .. పైగా కేంద్ర మాజీ మంత్రి, భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకి బంధువు కూడా.. అంతేకాదు  పురందేశ్వరి కూడా కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. వీరి బలం మరింత ఎక్కువగా ఉన్న నేపథ్యంలో.. నాన్ లోకల్ అయినా సరే ధర్మవరం కూటమిలో భాగంగా టికెట్ ఇవ్వడం జరిగింది. పైగా కమ్మ సామాజిక వర్గానికి చెందిన పరిటాల శ్రీరామ్ ధర్మవరం ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. ప్రస్తుతం టిడిపిలో గెలిచి గత ఎన్నికల్లో ఓడిపోయిన వరదాపురం సూరికి సీటు ఇవ్వడం శ్రీరామ్ కు గిట్టడం లేదు. ఈ నేపథ్యంలోనే కూటమిలో భాగంగా బిజెపికి అక్కడ సీటు కల్పించారు.. పైగా  సత్యకుమార్ భార్య కమ్మ సామాజిక వర్గానికి చెందినవారు కావడంతో.. బిసి కేటగిరీలో సత్యకుమార్ కి ధర్మవరం టికెట్ ఇచ్చినట్లు తెలుస్తోంది. అంతేకాదు  శ్రీరామ్ కూడా సత్యకుమార్ గెలుపు కోసం తన అనుచరులతో ధర్మవరం మొత్తం పెద్ద ఎత్తున ప్రచారాలు నిర్వహిస్తున్న విషయం తెలిసిందే..

ఇదిలా ఉండగా ఇక్కడ సత్యకుమార్ కు టికెట్ ఇవ్వడానికి మరో బలమైన కారణం కూడా ఉందని తెలుస్తోంది.. సత్య కుమార్ ప్రధానమంత్రి మోడీ సన్నిహితుడు అంటూ ప్రచారం జరగడం .. పైగా మోడీకి,  అమిత్ షా కి దేశ రాజకీయాలలో కీలకపాత్ర పోషించడం , ఉత్తర ప్రదేశ్ వంటి అతిపెద్ద రాష్ట్రంలో ఎన్నికల పరిశీలకునిగా కూడా పనిచేసిన అనుభవం ఆయనకు ఉందని.. అందుకే అన్ని విధాల పేరు ప్రఖ్యాతులు సొంతం చేసుకున్న సత్య కుమార్ గెలిస్తే ధర్మవరం అభివృద్ధి చెందుతుందని రాష్ట్ర బిజెపి నాయకులు భావించడం తో .. కూటమిలో భాగంగా ఆయనకు టికెట్టు లభించినట్లు వార్తలు వినిపిస్తున్నాయి.. ఇలా రెండు కోణాలలో ఆలోచించి సత్యకుమార్ ను  బరిలోకి దింపారు..
అయితే ముందుగా ఈ సీట్  కోసం టిడిపి నుంచి పరిటాల శ్రీరామ్ , జనసేన పార్టీ నుంచి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిలకం మధుసూదన్ రెడ్డి , బిజెపి నుంచి మాజీ ఎమ్మెల్యే రాష్ట్ర నాయకుడు గోనుగుంట్ల సత్యనారాయణ పోటీపడ్డారు.. కానీ వీరి ఎవరిని కాకుండా ఇన్ని కోణాలలో ఆలోచించి సత్యకుమార్ కు టికెట్టు ఇవ్వడం జరిగింది.. ఇక జనసేన, టిడిపి , బిజెపి శ్రేణులు సహాయ సహకారాలు అందిస్తే.. సత్య కుమార్ విజయాన్ని సాధించే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి..
మరొకవైపు వైసీపీ తరఫున ఎమ్మెల్యే అభ్యర్థిగా కేతిరెడ్డి వెంకట్రామిరెడ్డి పోటీ చేస్తున్న విషయం తెలిసిందే. గత ఎన్నికల్లో కూడా గెలిచి సత్తా చాటిన ఈయన "గుడ్ మార్నింగ్ ధర్మవరం" అంటూ ప్రతిరోజు గడపగడపకు తిరుగుతూ ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి సమస్యలను తీర్చే ప్రయత్నం చేశారు.. అందులో భాగంగానే కేతిరెడ్డి వెంకటరామిరెడ్డి పై ధర్మవరం ప్రజల్లో మంచి అభిప్రాయాలు ఉన్నాయి.. అయితే ప్రచారంలో భాగంగా ఈ మధ్య బహిరంగ  సభలలో ఆయన చేసే వ్యాఖ్యలు కొంతమందికి గిట్టడం లేదు. దీంతో ఈ విషయాలు ఈయనకు నెగిటివ్గా మారే అవకాశాలు ఉన్నాయి.. మరొకవైపు కూటమి.. ఇంకొక వైపు ఒంటరిగా కేతిరెడ్డి వెంకట్రాంరెడ్డి.. పోటాపోటీగా బరిలోకి దిగుతున్నారు. మరి ఇంతటి హోరాహోరీ పోటీలో ఎవరు గెలుస్తారన్నది ఉత్కంఠ గా మారింది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: