ఏపీ: పవన్ కి మద్దతుగా హీరో నాని..!
పిఠాపురంలో ఇప్పటికే పవన్ కళ్యాణ్ గెలుపు కోసం చాలామంది సెలబ్రిటీలు కమెడియన్స్ మెగా కుటుంబ సభ్యులు కూడా ప్రచారం చేస్తున్నారు.. అయితే ఒక్క పవన్ కళ్యాణ్ గెలుపు కోసం ఇంతమంది ప్రచారం చేస్తూ ఉండడంతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. ముఖ్యంగా అక్కడ వైసిపి నేత వంగా గీత పోటీలో ఉండడం చేత చాలా టఫ్ గా మారుతోంది. ఇప్పటికీ ఎంతోమంది నిర్మాతలు కూడా పవన్ కళ్యాణ్ కి సపోర్ట్ గా నిలుస్తున్నారు. ఇప్పుడు తాజాగా హీరో న్యాచురల్ స్టార్ నాని కూడా తన మద్దతును ట్విట్టర్ రూపంలో తెలియజేశారు..
నాని ఇలా తెలియజేస్తూ ప్రజాసేవ కోసం రాజకీయాలలోకి అడుగుపెట్టిన పవన్ కళ్యాణ్ ఈసారి ఎన్నికలలో గెలవాలని కోరుకుంటున్నానని పిఠాపురం అసెంబ్లీ పోరులో తలబడుతున్న జనసేన కి ఆల్ ది బెస్ట్ అంటూ కూడా వెల్లడించారు.. కేవలం సినీ కుటుంబంలో ఒకడిగా తన మద్దతు ఇదేనంటూ వివరించారు.. అలాగే ప్రజలకు ఇచ్చినటువంటి హామీలను కూడా నిలబెట్టుకోవాలని సూచించారు న్యాచురల్ స్టార్ నాని ప్రస్తుతం అందుకు సంబంధించి ట్వీట్ కూడా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతోంది.. అలాగే సినీ ఇండస్ట్రీ మద్దతు కూడా పవన్ కళ్యాణ్ కు ఉంటుందంటూ నాని ఆశాభావాన్ని తెలియజేస్తున్నారు.. ఏది ఏమైనా ఆంధ్రప్రదేశ్లోని పిఠాపురంలోని రాజకీయం మాత్రం ఇప్పటికీ హార్ట్ టాపిక్ గా మారుతోంది.