నారా లోకేష్‌కు ఛాన్స్ ఇచ్చిన ప్రధాని మోడీ.. అసలు దీని వెనుక కథ ఇదే!
జనసేన అధినేత పవన్, టీడీపీ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్‌తో కలిసి తొలుత సోమవారం రాజమండ్రి సమీపంలోని సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ సమయంలో ముందుగా లోకేష్ మాట్లాడిన తర్వాత మోడీ మాట్లాడారు. ఇక ఆ సభలో మోడీని లోకేష్ ఆకాశానికి ఎత్తేశారు. ఓ వైపు దేశం మోడీ నాయత్వంలో ముందుకు వెళ్తుంటే రాష్ట్రంలో జగన్ నాయకత్వంలో అభివృద్ధి అధోగతి పాలైందన్నారు. జగన్‌పై విమర్శలతో లోకేష్ విరుచుకుపడ్డారు. ప్రధాని మోడీ సైతం ఏపీ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందన్నారు. అనంతరం అనకాపల్లి సభలో ప్రధాని మోడీ పాల్గొన్నారు. ఆ సభలో చంద్రబాబు, నాగబాబు సైతం ఉన్నారు. ఇక దేశవ్యాప్తంగా ఎన్నికల ప్రచారంలో బిజీబిజీగా గడుపుతున్న ప్రధాని మోడీ కీలక నిర్ణయం తీసుకున్నారు. అనకాపల్లి సభలో చంద్రబాబు కంటే ముందు ప్రసంగించారు. అనంతరం ప్రజలంతా చంద్రబాబు ప్రసంగం విని వెళ్లాలని కోరారు. తనకు బిజీ షెడ్యూల్ కారణంగా త్వరగా వెళ్తున్నట్లు చెప్పారు. ఈ ప్రకారం చూస్తే లోకేష్ ప్రసంగించడానికి అవకాశమిచ్చిన ప్రధాని మోడీ చంద్రబాబుకు మాత్రం ఆ అవకాశం ఇవ్వలేదు. దీంతో లోకేష్‌కు ప్రధాని మోడీ ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చారని రాజకీయ వర్గాల్లో చర్చ సాగుతోంది.