ఏపీ : టీడీపీకి అదిరిపోయే గిఫ్ట్ ఇచ్చిన మోదీ..!!
అలాగే వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేసారు వైసీపీ ప్రభుత్వం మూడు రాజధానులు నిర్మిస్తామని చెప్పింది. మరి ఇన్నేళ్లలో ఒక్క రాజధాని అయినా కట్టారా? మూడు రాజధానుల పేరిట చాలా భారీ ఎత్తున లూటీ చేసే ప్రయత్నంలో వున్నారు. ప్రస్తుత ప్రభుత్వ ఖజానా పూర్తిగా ఖాళీ అయింది. వీళ్లు అవినీతిని మాత్రమే చేయగలరు, ఆర్థిక వ్యవహారాల నిర్వహణ మాత్రం ఈ వైసీపీ ప్రభుత్వానికి తెలియనే తెలియదు. ప్రజలకు సేవ చేయాలన్న కోరిక లేని వైసీపీ ప్రభుత్వం అధికారంలో ఉంటే ఇలాంటి ఫలితాలే ఎదురైవుతాయని మోదీ విమర్శించారు..పోలవరం ప్రాజెక్టును పూర్తిగా నిలిపివేసి ఆంధ్రప్రదేశ్ జీవనాడికి వైసీపీ బ్రేక్ వేసింది.. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాజెక్టు కోసం రూ.15 వేల కోట్లు ఇచ్చింది. కానీ వైసీపీ ప్రభుత్వం ఈ ప్రాజెక్టును మాత్రం ముందుకు తీసుకెళ్లలేదని మోదీ విమర్శించారు... ఇదిలా ఉంటే మోదీ స్పీచ్ పై తెలుగు దేశం పార్టీ ఫుల్ హ్యాపీగా వుంది. అయితే కూటమికి మద్దతు ఇచ్చిన కూడా మోదీ వైసీపీ ని విమర్శించకపోవడంతో టీడీపీ డీలా పడింది. ఇప్పటి స్పీచ్ తో మోదీ టీడీపీకి అదరిపోయే గిఫ్ట్ ఇచ్చారంటూ టీడీపీ వర్గాలు వారు ఆనందిస్తున్నారు..