మైదుకూరులో వైసీపీకి చుక్కలు చూపిస్తున్న పుట్టా.. కంచుకోట లెక్కలు మారుతున్నాయా?
ఈ ఎన్నికల్లో మరోసారి పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు కోసం తీవ్రంగా శ్రమిస్తుండగా మైదుకూరులో టీడీపీకే అనుకూల ఫలితాలు రావచ్చని కొన్ని సర్వేలు చెబుతున్నాయి. పుట్టా సుధాకర్ యాదవ్ కు లక్ కూడా తోడైతే ఈ ఎన్నికల్లో ఆయన విజయాన్ని ఎవరూ ఆపలేరని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఈ నియోజకవర్గంలో వైసీపీ నుంచి ఎస్.రఘురామిరెడ్డి పోటీ చేస్తున్నారు.
పుట్టా సుధాకర్ యాదవ్ యనమల రామకృష్ణుడికి వియ్యంకుడు కాగా పుట్టా సుధాకర్ యాదవ్ కొడుకు పుట్టా మహేష్ యాదవ్ కూటమి తరపున ఏలూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. యనమల, పుట్టా కుటుంబాలకు కూటమి నుంచి ఎక్కువ టికెట్లు దక్కాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. అయితే ఈ కుటుంబాలు యాదవ సామాజిక వర్గానికి మేలు జరిగేలా ఎంతో చేయాల్సి ఉందని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది.
పుట్టా సుధాకర్ యాదవ్ ఈ ఎన్నికల్లో ప్రచారం విషయంలో సైతం ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. వైసీపీ కంచుకోటలో పుట్టా సుధాకర్ యాదవ్ సత్తా చాటుతారో లేదో చూడాల్సి ఉంది. నియోజకవర్గంలో రఘురామిరెడ్డిపై ఉన్న వ్యతిరేకత ఆయనకు ప్లస్ కానుంది. మైదుకూరు నియోజకవర్గంలో గెలుపును వైఎస్ జగన్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారని సమాచారం అందుతోంది. ఎన్నికల ఫలితాలు ఏ పార్టీకి అనుకూలంగా ఉంటాయో చూడాలి. పుట్టా సుధాకర్ యాదవ్ గెలుపు కోసం మైదుకూరు నియోజకవర్గంలోని టీడీపీ నేతలు ఎంతో కష్టపడుతున్నారని సమాచారం అందుతోంది. ఈ నియోజకవర్గంలో ఏ పార్టీ సత్తా చాటుతుందో చూడాల్సి ఉంది.