కుప్పంలో ఓటు రేటు అంత పలుకుతోందా.. రెండు పార్టీలు అస్సలు తగ్గట్లేదుగా!

Reddy P Rajasekhar
మాజీ ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుప్పం నుంచి మళ్లీ పోటీ చేస్తున్న నేపథ్యంలో ఈ ఎన్నికల్లో ఆయనను ఓడించాలని వైసీపీ ఒకింత పట్టుదలతో ఉంది. గతంతో పోల్చి చూస్తే కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబుపై వ్యతిరేకత పెరిగింది. కుప్పం నియోజకవర్గం అభివృద్ధి కోసం వైసీపీ ఎక్కువ మొత్తం ఖర్చు చేయడం కూడా ఆ పార్టీకి ఒకింత ప్లస్ అవుతున్న సంగతి తెలిసిందే.
 
ఒక రాజకీయ పార్టీ అనుకూలంగా ఉన్న చోట్ల 4000 రూపాయలకు ఆశించిన విధంగా పరిస్థితులు లేని చోట 5000 రూపాయలు ఇస్తున్నట్టు తెలుస్తోంది. ప్రత్యర్థి రాజకీయ పార్టీ సైతం గెలుపు కోసం ఇదే స్థాయిలో ఖర్చు చేయాల్సిన పరిస్థితి నెలకొందని భోగట్టా. గతంలో ఎప్పుడూ ఖర్చు చేయని స్థాయిలో ఈ ఎన్నికల్లో కుప్పం నియోజకవర్గంలో అభ్యర్థులు ఖర్చు చేస్తున్నారని సమాచారం అందుతోంది.
 
ఈ ఎన్నికల్లో గెలుపును ఇరు పార్టీలు ప్రెస్టీజ్ గా తీసుకున్నారని సమాచారం అందుతోంది. రాష్ట్రంలో ఏ నియోజకవర్గంలో ఓటుకు ఇంత మొత్తం ఖర్చు చేసే పరిస్థితులు అయితే లేవని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. రాష్ట్రంలో ఏ పార్టీకి అనుకూలంగా ఓట్లు పడతాయో చూడాల్సి ఉంది. కుప్పంలో ఈసారి చంద్రబాబు ఓడిపోయినా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదని సర్వేలు చెబుతున్నాయి.
 
మెజారిటీ సర్వేలు మాత్రం చంద్రబాబు మళ్లీ ఎమ్మెల్యే అవుతారని ఆయన గెలవడం మాత్రం కష్టమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబు ఎన్నికల్లో ఓటమి పాలైతే మాత్రం ఆయన పరువు పోవడం ఖాయమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. వైసీపీ నుంచి ఈ నియోజకవర్గంలో కే జే భరత్ పోటీ చేస్తున్నారు. కుప్పం విషయంలో ఏ పార్టీ నమ్మకం నిజమవుతుందో చూడాలి. చంద్రబాబు నాయుడు మాత్రం గతంలో ఏ ఎన్నికలకు పడని స్థాయిలో ఈ ఎన్నికలకు సంబంధించి టెన్షన్ పడుతున్నారని తెలుస్తోంది. ఎన్నికల సమయానికి చంద్రబాబు టెన్షన్ తగ్గుతుందేమో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: