ఆంధ్రప్రదేశ్లో మన నాలుగు రోజుల్లో ఎన్నికలు జరగనున్నాయి. ప్రధాన పార్టీల గెలుపోటముల గురించి ఇప్పటికే అనేక సర్వేలు గ్రౌండ్ లెవెల్ రిపోర్ట్ లు ఇచ్చాయి.అయితే ఆ సర్వేలలోప్రస్తుతం పయనీర్ పోల్స్ స్ట్రాటజీ ఇచ్చిన సర్వే రిపోర్టు ప్రకారం మొత్తం లోక్సభ స్థానాలు దాని అనుబంధ నియోజకవర్గాల్లో సర్వే రిపోర్ట్ లు ఈ విధంగా ఉన్నాయి. మొత్తం 25 ఎంపీ సీట్లలో టిడిపి కూటమి 20 స్థానాలు వైసీపీ 5 స్థానాలు గెలుస్తుందని సర్వే రిపోర్టులో తేలింది. అసెంబ్లీ సీట్లు సంబంధించి 126 సీట్లు కూటమికని,33 సీట్లు వైసిపి కని, మరియు కమ్యూనిస్టు కూటమి కలిసి ప్రత్యేకంగా 16 సీట్లు గెలుస్తుందని సర్వేలో తేలింది.
శ్రీకాకుళం లోక్సభలోని ఏడు నియోజకవర్గాల్లో ఒక పలాస టఫ్ ఫైట్ గా ఉండి మిగిలిన సీట్లు టిడిపి గెలుచుకుంటుందని, ఎంపీ స్థానం టిడిపి గెలుస్తుందని సర్వేలో తేల్చింది.విజయనగరం లోక్సభ స్థానం టిడిపి గెలుస్తుందని అలాగే ఏడు నియోజకవర్గాల్లో నెలిమర్ల, గజపతిపురం టఫ్ ఫైట్ గాను, వైసీపీ రెండు స్థానాలు టీడీపీ మూడు స్థానాలు గెలిచే అవకాశాలు ఉన్నాయి.అనకాపల్లి లోక్సభ నియోజకవర్గంలో ఎంపీ వైసీపీ గెలుస్తుందని పాలకొండ, పాడేరు, రంపచోడవరంలో టఫ్ ఫైట్ గాను వైసీపీకి నాలుగు స్థానాలు గెలిచే అవకాశాలున్నాయి.
విశాఖపట్నం లోక్సభ నియోజకవర్గంలోని ఏడు స్థానాలలో ఎంపీ టిడిపికని, ఏడు నియోజకవర్గాలలో టిడిపి మొత్తం క్లీన్ స్వీప్ చేస్తుందని అంచనా వేస్తున్నారు. కాకినాడ లోక్సభలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ టీడీపీ కని వైసీపీ తుదిస్థానం తప్పించి మిగిలిన సీట్లు మొత్తం టిడిపి కైవసం చేసుకుంటుందని అంచనా వేస్తున్నారు. రాజమండ్రి లోక్సభ స్థానంలోని ఏడు నియోజకవర్గాల్లో ఎంపీ టిడిపి గెలుస్తుందని అనపర్తి, గోపాలవరం టఫ్ ఫైట్ గాను మిగిలిన అన్ని స్థానాలు టీడీపీ కైవసం చేసుకుంటుందని తేలింది.
అమలాపురం లోక్సభలోని ఏడు నియోజకవర్గాలలో టాప్ ఫైట్ రామచంద్రపురం మిగిలిన అన్ని స్థానాల్లో టిడిపి గెలుస్తుందని తేలింది.నరసాపురం లోని లోక్సభ ఏడు నియోజకవర్గాలలో ఎంపీ తో సహా అన్ని స్థానాలు టీడీపీ గెలుస్తుందని, ఏలూరు లోక్సభ నియోజకవర్గంలో ఒక పోలవరం మినహా మిగిలిన స్థానాలన్నీ టిడిపికే దక్కుతాయని, మచిలీపట్నం లోక్సభ స్థానాలలో ఉన్న నియోజకవర్గాలలో మొత్తం టిడిపి క్లీన్ స్వీప్ చేస్తుందని, విజయవాడ లోక్సభ స్థానాలలో ఉన్న నియోజకవర్గాలలో ఒక్క తిరువూరు మినహా మిగిలిన అన్నీ స్థానాలు టిడిపి క్లీన్ స్వీప్ చేస్తుందని, గుంటూరు లోక్సభ స్థానాలలోని నియోజకవర్గాలలో మొత్తం టిడిపి క్లీన్ స్లీప్ చేస్తుందని, నరసరావుపేట లోని ఏడు నియోజకవర్గాలలో ఎంపీ తో సహా మొత్తం టిడిపి క్లీన్ స్వీప్ చేస్తుందని కాకపోతే నరసరావుపేట, వినుకొండ ఈ రెండు స్థానాలు వైసీపీకి దక్కుతాయని తేలింది.ఈవిధంగా ఎటు చూసిన కూడా ఎక్కువ శాతం టీడీపీనే అధికారం చేపట్టే దిశగా తన సర్వే ఉన్నట్లు రాజకీయా విశ్లేషకులు చెప్తున్నారు.