• ఓవైసీని ఓడించడం సాధ్యమవుతుందా
• హైదరాబాదులో బీజేపీ బలపడుతుందా..
• సోషల్ మీడియా క్రేజ్ మాధవికి కలిసి వస్తుందా.
ప్రస్తుతం తెలంగాణ చూపు హైదరాబాద్ పార్లమెంట్ సీటుపై పడింది. గత కొన్ని పర్యాయాల నుంచి ఈ పార్లమెంటు బరిలో ఓవైసీ తన మానియా చూపిస్తూ వస్తున్నారు. అలాంటి ఓవైసీని ఈసారి ఢీకొట్టేందుకు డైనమిక్ లీడర్ మాధవిలత బీజేపీ తరఫున బరిలో నిలిచారు. రాజకీయాలు కొత్త అయినా సరే రకరకాల కామెంట్లు చేస్తూ ఒక్కసారిగా రాష్ట్ర ప్రజల చూపు తన వైపు తిప్పుకునేలా చేశారని చెప్పవచ్చు. అలాంటి మాధవిలత రాజధానిలో రాణి అవుతుందా లేదా అనే వివరాలు తెలుసుకుందాం..
ప్రస్తుతం సోషల్ మీడియాలో కానీ మెయిన్ మీడియాలో కానీ ఎక్కడ చూసినా ట్రెండింగ్ పొలిటిషన్ గా హైదరాబాద్ బీజేపీ ఎంపీ అభ్యర్థి మాధవి లత నిలుస్తున్నారు. జాతీయ మీడియా సంస్థలు కూడా మాధవి లత ఇంటర్వ్యూ కోసం ఎగబడుతున్నారు. ఇంగ్లీష్, హిందీ, తెలుగు భాషల్లో అనర్గళంగా మాట్లాడే మాధవిలత ఏం మాట్లాడినా ఆలోచన చేసే విధంగానే ఉంటుంది. అంతేకాకుండా మాధవి లతను ప్రధాని మోడీ,అమిత్ షా కూడా ఏ సభ జరిగినా తప్పనిసరిగా ఆమె పేరు ప్రస్తావిస్తూ వస్తున్నారు.. ఎలాగైనా హైదరాబాద్ నడివొడ్డున ముస్లింలకు వ్యతిరేకంగా హిందూ ఓట్లన్ని ఏకం చేసి మాధవి లతని గెలిపించాలని ప్రయత్నం చేస్తున్నారు. అంతేకాకుండా ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ను ఈసారి ఓడిస్తామని మాధవిలత చెబుతూ వస్తోంది. అంతేకాకుండా ఆమె ప్రచారంలో పాల్గొంటూ రకరకాల స్టంట్లు చేస్తోంది.
అయితే మాధవీ లత ఈసారి ఎలాగైనా అసదుద్దీన్ ఓవైసీ ని పడగొట్టి హైదరాబాద్ ఇలాకాలో పాగా వేయాలని చూస్తోంది. కానీ ఇది సాధ్యమయ్యే పని కాదని కొంతమంది రాజకీయ విశ్లేషకుల భావన.. ఇప్పటికే అసదుద్దీన్ అక్కడ హైట్రిక్ విజయాలు సాధించాడు. గత ఎన్నికల్లో కూడా 2,82,000 మెజారిటీ సాధించాడు. అలా ఎంతో బలమున్నటువంటి అసదుద్దీన్ ఓవైసీని హైదరాబాదులో ఓడించడం అనేది చాలా కష్టతరం. అయినా మాధవి లత మాత్రం ఈసారి రాజధానిలో గెలుస్తానని, మతపరమైనటువంటి కామెంట్స్ చేస్తూ దూసుకుపోతోంది. మొన్నటికి మొన్న మసీదుకు విల్లు ఎక్కు పెట్టినట్టు ఫోజు ఇచ్చి విపరీతంగా హైప్ తెచ్చుకుంది . దీంతో అసదుద్దీన్ ఓవైసీ వర్గం ఆమెపై కేసు కూడా పెట్టారు. ఈ విధంగా హైదరాబాద్ ఇలాకాలో అసదుద్దీన్ ఓవైసీ మాధవి లత మధ్య హోరాహోరీ పోరు జరుగుతుంది.