ఏపీ : జగన్ షో సక్సెస్... చంద్రబాబు షో తుస్.?
జగన్ తన ఇంటర్వ్యూలో భాగంగా భూ సర్వే గురించి ముఖ్యంగా ల్యాండ్ టైట్లింగ్ చట్టం గురించి ఆయన లేవనెత్తిన సందేహాలు సంధించిన ప్రశ్నలకు జగన్ స్పష్టంగా సమాధానాలు ఇచ్చారు. అసలు తన విజన్ మరియు తన పాలనా విధానం ఏమిటి అనేదాని మీద స్పష్టంగా తాను వివరణ ఇచ్చారు.ఒకవైపు చంద్రబాబు ఇంటర్వ్యూ చూసే వాళ్లు కరువైయ్యారు అనే విధంగా ఉంది.చంద్రబాబు ప్రసంగాలు ఎంత బోర్ కొట్టిస్తాయో, ఆయన ఇంటర్వ్యూ కూడా అట్లాగే విసుగు పుట్టిస్తుంటుంది. అందుకే చంద్రబాబు మాట్లాడితే ఎవరూ పట్టించుకోరు.ఇక చంద్రబాబు దాదాపు 14 ఏళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నప్పటికీ.. తాను పేదలకు ఏం చేశానో చెప్పుకోలేకపోతున్నారు. సంక్షేమం విషయంలో తన మార్క్‌ను చూపించడంలో అట్టర్ ఫ్లాప్ అయ్యారు చంద్రబాబు. ఇప్పటికీ జగన్ పథకాలనే కాపీ కొట్టి తన మేనిఫెస్టోగా ప్రచారం చేసుకుంటున్నారు బాబు.ఈ ఇంటర్వ్యూలను ఉదాహరణగా తీసుకుంటే ప్రజల్లో విశ్వసనీయత, నిజాయితీ కలిగిన నాయకులకు ఎప్పుడూ గుర్తింపు ఉంటుందని వైసీపీ నేతలు ప్రచారం చేయడం ప్రారంభించారు. ఇదే సీఎం జగన్ కు ప్రజల్లో ఉన్న ఇమేజ్. వైయస్ అంటే ఒక బ్రాండ్ అని మరోసారి ప్రజలకు తెలిసేలా చేసిన ఈ ఇంటర్వ్యూ మరలా సీఎం పీఠం ఎక్కించబోతుందనే చెప్పకనే చెప్తున్నాయి.