ఏపీ: ఎన్నికలవేళ జగన్ కు మరో షాక్... నిధులు విడుదల కాకుండా పిటీషన్?
ఇక డీబీటీ పథకాలను అడ్డుకుంటూ ఈసీ ఉత్తర్వులను ఇవ్వాళ్టి వరకూ నిలుపుదల చేస్తూ హైకోర్టు నిన్న తీర్పు ఇచ్చిన సంగతి అందరికీ తెలిసినదే. కాగా హైకోర్టు తీర్పు కాపీతో ఈసీని సంప్రదించారు అధికారులు. అయితే.. క్లారిఫికేషన్ కోసం ఈసీని వివరణ కోరారు అధికారులు. అయినప్పటికీ ఇప్పటివరకూ ఎలాంటి క్లారిఫికేషన్ ఇవ్వలేదు ఈసీ. ఎన్నికల సంఘం పరిధిలో పనిచేస్తున్నందున ఎన్నికల కమిషన్ క్లారిఫికేషన్ ఇస్తే తప్ప ముందుకు వెళ్లలేమంటున్నారు అధికారులు. ఇక ఈసీ క్లారిఫికేషన్ ఆలస్యమైతే హైకోర్టు ఇచ్చిన గడువు ముగిపోతోందని లబ్ధిదారులు ఆవేదన చెందుతున్నారు.
ఇకపోతే. మొన్నటికి మొన్న జగన్కు అనుకూలంగా పనిచేస్తున్న అధికారులను కేంద్ర ఎన్నికల కమిషన్ బదిలీ చేసిన సంగతి కూడా తెలిసినదే. ఈ క్రమంలోనే తాజాగా ఏపీలో మరో ఇద్దరు డీఎస్సీ లను బదిలీ చేయడం జరిగింది. అనంతపురం టౌన్ డిఎస్పీ వీర రాఘవ రెడ్డి తోపాటు రాయచోటి డిఎస్పీ మహబూబ్ బాషాను సీఈసీ బదిలీ చేసింది. ఇక ఈ పరిణామాలు వైస్సార్సీపీ పార్టీలో గుబులు పుట్టిస్తున్నాయి. అంతేకాకుండా నిన్న పోస్టల్ బ్యాలెట్ పోలింగ్ కూడా జగన్ కి కంటిమీద కునుకు లేకుండా చేస్తోందని విశ్వసనీయ వర్గాల సమాచారం. మునిపెన్నడూ లేనంతగా వివిధ శాఖల అధికారులు ఈ ఎన్నికల్లో ఎగబడి మరీ ఓట్లు వేసినట్టు తెలుస్తోంది. దాదాపుగా అందరూ కూటమికే ఓటేసినట్టు గుసగుసలు వినబడుతున్నాయి.