అల్లు అర్జున్: వైసీపీ స్నేహితుడి కోసం అలాంటి ప్లాన్..!

Divya
మరో రెండు రోజులలో రెండు తెలుగు రాష్ట్రాలలోని లోక్సభ ఎన్నికల సైతం జరగబోతున్నాయి.. ఆంధ్రప్రదేశ్ లోక్సభ ఎన్నికలతో పాటు అసెంబ్లీ ఎన్నికలు కూడా ఒకేసారి జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలోనే అన్ని పార్టీలు కూడా తమ అభ్యర్థులను పెద్ద ఎత్తున ప్రచారం చేస్తూ ముందుకు వెళుతున్నాయి. చాలా పార్టీలు సైతం ఇప్పటికే అభ్యర్థి ఓటర్లను తమ వైపు తిప్పుకునేందుకు అనేక రకాల పథకాలను వరాలను సైతం కురిపిస్తూ ఉన్నారు. అయితే ఈసారి ఎన్నికలలో సినీ గ్లామర్ మరింత ఎక్కువగా కనిపిస్తోందని చెప్పవచ్చు.

అసలు విషయంలోకి వెళ్తే టాలీవుడ్ లో స్టైలిష్ స్టార్ గా పేరు పొందిన అల్లు అర్జున్ ఇటీవల తన మామ అయిన పవన్ కళ్యాణ్ కు సోషల్ మీడియా వేదికగా మద్దతు ఇచ్చారు.. దీంతో అల్లు అర్జున్ అభిమానులు పవన్ కళ్యాణ్ కి మద్దతు తెలుపుతున్నట్లు సోషల్ మీడియాలో పోస్టుల సైతం షేర్ చేశారు.. అయితే ఇప్పుడు తాజగా అందుతున్న సమాచారం ప్రకారం అల్లు అర్జున్ స్నేహితుడు నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్నటువంటి రవిచంద్ర కిషోర్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపేందుకు సైతం తన భార్య స్నేహారెడ్డి తో ఈరోజు ఉదయం నంద్యాలకు చేరుకోబోతున్నట్లు సమాచారం.

అల్లు అర్జున్ రాబోయే ఎన్నికలలో వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న తన స్నేహితుడు రవిచంద్ర కిషోర్ రెడ్డికి ఎలక్షన్ క్యాంప్ ను అల్లు అర్జున్  తన భార్యతో కలిసి చేస్తాడా లేదా అనే విషయం పైన ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా చర్చలు జరుగుతున్నాయి.. లేకపోతే అల్లు అర్జున్ నంద్యాలకు వెళ్లి తన స్నేహితుడికి శుభాకాంక్షలు తెలిపేందుకు వెళ్ళబోతున్నారనే విషయం కూడా వినిపిస్తోంది. మరి ఏం జరుగుతుందనే విషయం ఈరోజు తెలియబోతోంది. ప్రస్తుతం అల్లు అర్జున్ కి సంబంధించి ఈ విషయం మాత్రం వైరల్ గా మారుతోంది. ప్రస్తుతం ఎన్నికల జోరు ఎక్కువగానే కొనసాగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: