చంద్రబాబు Vs జగన్: పథకాలు - హామీలు.. ఎవరు హీరో.. ఎవరు జీరో..!
- రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ, ఇంటికో ఉద్యోగం, నిరుద్యోగ భృతిపై మాట తప్పిన బాబు
- సంక్షేమ పథకాలు ఇచ్చి మళ్లీ ఓట్లడగుతోన్న జగన్
( విజయవాడ - ఇండియా హెరాల్డ్ )
ఏ పార్టీ అయినా.. అధికారంలోకి రావాలంటే.. ఖచ్చితంగా ప్రజలను మెప్పించాలి. ప్రజలను తనవైపు తిప్పుకోవాలి. ఢిల్లీ నుంచి గల్లీ వరకు.. ఏ పార్టీ అధికారంలోకి రావాలన్నా.. పథకాలు ప్రకటించాల్సిందే.. హామీలు ఇవ్వాల్సిందే. ఆది నుంచి అనాది నుంచి అన్నట్టుగా.. దేశంలో రాష్ట్రంలో ముఖ్యంగా ప్రజాస్వా మ్య దేశాల్లో పార్టీలు అధికారంలోకివచ్చేందుకు ఎంచుకునే తొలి పంథా.. పథకాలు, హామీలే. ఏపీలోనూ ఇవే ఇప్పుడు కీలక రోల్ పోషిస్తున్నాయి. ప్రజలను ఆకర్షించేందుకు పార్టీలు వినూత్న పథకాలతో ముందుకు వస్తున్నాయి.
భవిష్యత్తు విషయాన్ని పక్కన పెడితే.. ఇప్పటి వరకు రాష్ట్రం ఏర్పడిన తర్వాత.. 2014-2019 వరకు చంద్ర బాబు పాలించారు. మరి ఈయన ఇచ్చిన హామీలు అమలయ్యాయా? అనేవి కీలకం. కొన్నింటిని అమలు చేశారు.. కొన్ని చేయలేక పోయారు. అప్పట్లో పొత్తు పెట్టుకుని విజయం సాధించి సీఎం సీటెక్కిన చంద్ర బాబు.. అనేక హామీలు ఇచ్చారు. రైతులకు సంపూర్ణ రుణ మాఫీ అన్నారు. డ్వాక్రారుణాల మాఫీ అని చెప్పారు. ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు. ఉద్యోగం రాని వారికి నిరుద్యోగ భృతి ఇస్తామన్నారు.
కానీ ఇవ్వలేక పోయారు. ఎన్నికలకు మూడు నెలల ముందు.. మాత్రం నిరుద్యోగ భృతిని కొందరికి వేశారు. అది చంద్రబాబు ఇమేజ్‌ను దెబ్బతీసింది. ఇక, రైతు రుణ మాఫీపై అనేక కుప్పిగంతులు వేశారు. దానినీ సంపూర్ణంగా చేయలేక పోయారు. డ్వాక్రా రుణ మాఫీని ఐదేళ్లుగా నాన్చి.. ఎన్నికలకు ముందు రూ.10 వేల ను పసుపు-కుంకుమ కింద అందించారు. ఇది కూడా.. చంద్రబాబు విశ్వసనీయతపై మసక వచ్చేలా చేసింది. ఇక, వైసీపీ అధినేత జగన్ విషయాన్ని తీసుకుంటే.. భారీ ఎత్తున సంక్షేమ పథకాలు ప్రవేశ పెడతామనే హామీతో 2019లో అధికారంలోకి వచ్చారు.
అమ్మ ఒడి, రైతు భరోసా, విద్యా దీవెన... ఇలా అనేక పథకాలు వేల కోట్ల రూపాయలతో ముడిపడిన వ్యవ హారం. అయినా.. జగన్ ఎక్కడా వెనక్కి తగ్గలేదు. అధికారం చేపట్టిన ఆరు మాసాల్లోనే వీటిని అమల్లో పె ట్టారు. కడ దాకా కొనసాగించారు. మధ్యలో అనేక విమర్శలు వచ్చాయి. ఇలా ఇస్తూ పోతే.. రాష్ట్రం శ్రీలంక అయిపోతుందని.. రావకాష్టం అయిపోతుందని.. ఖజానాని దోచి పెడుతున్నారని అన్నా.. జగన్ వెనుదిరిగి చూసుకోలేదు. పేదలకు.