పవన్: వెనకబడ్డ పిఠాపురంని గెలిచి అభివృద్ధి చేస్తాడా?
అయితే అధికార వైసీపీ కాపు సామాజిక వర్గానికే చెందిన కాకినాడ ఎంపీ వంగా గీతను బరిలోకి దించారు. 2009 వ సంవత్సరంలో ప్రజారాజ్యం తరపున ఎమ్మెల్యేగా గెలిచిన వంగా గీత, 2019 సంవత్సరంలో కాకినాడ నుండి వైసీపీ ఎంపీగా గెలిచింది.పవన్ కళ్యాణ్ గెలుపుకోసం టాలీవుడ్ చిన్న, పెద్ద నటులు, జబర్దస్త్ నటులు కూడా ప్రచారానికి దిగారు. పవన్ కళ్యాణ్ అన్న నాగబాబు అక్కడే ఉండి ఎన్నికల వ్యవహారాలు పర్యవేక్షిస్తున్నాడు. ఎన్నికల ప్రచారం చివరి రోజు మెగాస్టార్ చిరంజీవి రావాల్సి ఉండగా ఆఖరు నిమిషంలో క్యాన్సిల్ అయింది. ఈ నేపథ్యంలో ఆయన కొడుకు మరో మెగా హీరో రాంచరణ్ ప్రచారం చేస్తున్నాడు.చివరి రోజు ప్రయాణానికి వైసీపీ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పిఠాపురం అభ్యర్థి వంగా గీత తరపున ప్రచారం చేశారు. పవన్ ఎన్నికల తర్వాత అందుబాటులో ఉండడు. గీత అందుబాటులో ఉంటుంది. అందుకే అందుబాటులో ఉన్న వారికే ఓటువేయాలన్న చర్చ పిఠాపురంలో నడుస్తుంది.
అయితే ఈసారి పవన్ గెలిచే ఛాన్స్ ఉండొచ్చు. ఎందుకంటే పిఠాపురం అభివృద్ధి పరంగా వెనకపడిపోయింది. అక్కడ సినీ సెలబ్రిటీల గ్లామర్, షూటింగ్స్ తప్ప ఏమి లేదు. అక్కడ ప్రజలు పేదరికంతో మగ్గుతున్నారు. చాలా మంది ఇల్లులు లేక సముద్రం దగ్గరలో మురికి వాడల్లో పేదరికం అనుభవిస్తున్నారు. గతంలో వైసీపీ, టీడీపీ పార్టీలు గెలిచినా కూడా ఏమాత్రం అభివృద్ధి చెయ్యలేదు. రాజకీయ నాయకులు ప్రజలకు అబద్దపు ప్రమాణాలు చేశారే తప్ప అక్కడ ప్రజల జీవితాలని మార్చలేదు. అక్కడ రోడ్లు సరిగ్గా ఉండవు. తాగు నీటి వసతి లేదు. సరైన స్కూల్లు లేవు. పేదలకు ఇల్లులు లేవు. ఎక్కడ చూసిన మురికివాడలే కనిపిస్తాయి.మరి పవన్ కళ్యాణ్ అయినా గెలిచి పిఠాపురాన్ని అభివృద్ధి చేస్తాడో లేడో చూడాలి.