తెలంగాణ ఎలక్షన్స్ కంటే ఏపీ ఎలక్షన్స్ చాలా రసవత్తరంగా సాగుతూ ఉంటాయి. ఇక్కడ ఎలక్షన్స్ వచ్చాయంటే చాలు చాలామంది సినీ ఇండస్ట్రీ స్టార్ హీరో హీరోయిన్లు ఇతర నటీనటులంతా వచ్చి ప్రచారాలు చేస్తూ ఉంటారు. అయితే ఈ ప్రచారాలపర్వం ఈ 2024 ఎన్నికల్లో మరింత జోరందుకుంది. దీనికి ప్రధాన కారణం పవన్ కళ్యాణ్ మరియు హీరో హీరోయిన్ల బంధువులు, స్నేహితులు ఈసారి ఎమ్మెల్యేలు, ఎంపీలుగా పోటీ చేయడమే. చాలామంది హీరో హీరోయిన్లు, కమెడియన్లు ప్రచార ఎండింగ్ సమయంలో వచ్చి మరింత ఉత్సాహాన్ని అందించారు. మరి వీరు ఇచ్చిన క్లైమాక్స్ టచ్ వర్కౌట్ అవుతుందా లేదా అనే వివరాలు చూద్దాం.
ఇప్పటికే ప్రచారం అంతా ముగిసిపోయింది. ఇప్పుడు ఈ రాబోవు కొన్ని గంటల్లో అంతా సైలెంట్ గా పంపకాలు జరుగుతాయి.. ఈ ప్రచార సమయంలో లాస్ట్ మినిట్ సినీ తారలంతా ప్రచార పర్వంలో పాల్గొన్నారు. సాయి ధరంతేజ్, నిఖిల్,వరుణ్ తేజ్,జబర్దస్త్ ఆర్టిస్టులంతా పిఠాపురం వచ్చి పవన్ కళ్యాణ్ తరఫున ప్రచారం నిర్వహించారు. ఇక సైలెంట్ గా ఉండే అల్లు అర్జున్ కూడా చివరి సమయంలో నంద్యాలలో ప్రత్యక్షమై తన స్నేహితుడి తరుపున ప్రచారం చేశారు. దీంతో నంద్యాల పోరు చాలా ఆసక్తికరంగా మారింది. ఎలాంటి ఆర్భాటాలకు పోనటువంటి వెంకటేష్ కూడా ఖమ్మం కైకలూరులో చివరి సమయంలో ప్రచారం చేశారు. ఈ క్రమంలోనే ఒక వార్త జోరందుకుంది. అదేంటంటే.. సినిమాల్లో క్లైమాక్స్ బాగుంటే సినిమా హిట్ అవుతుంది. మరి ఈ ప్రచారాల్లో క్లైమాక్స్ లో ఎంట్రీ ఇచ్చిన ప్రచారం వర్కౌట్ అవుతుందా..
లేదా అనేది చాలామంది విశ్లేషకులు ఆలోచిస్తున్నారు.కట్ చేస్తే..సినిమా స్టార్స్ ప్రచారం వల్ల ఓట్లు వస్తాయనేది చెప్పడం కష్టం. ఒకవేళ అదే వర్కౌట్ అయితే పవన్ కళ్యాణ్, చిరంజీవి ఇప్పటికే రాజకీయాల్లో చక్రం తిప్పేవారు. కానీ సినిమాలు వేరు రాజకీయాలు వేరు అని వీరిని చూస్తేనే అర్థం చేసుకోవచ్చు. వారు ఎంత క్రేజ్ ఉన్న ఎంత మంది జనాలు వచ్చినా అవి ఓట్ల రూపంలో మాత్రం జమవ్వడం లేదు. కానీ ఈసారి కొంతమంది అభ్యర్థుల తరుపున ఈ సినీ తారల ప్రచారాలు ఈ ఎన్నికల్లో ఏమైనా ప్రభావం చూపుతాయా లేదా అనేది రిజల్ట్ తర్వాత తెలుస్తుంది.