ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రేపు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కమిషన్ నిన్నటి వరకు మాత్రమే ప్రచారాలను నిర్వహించుకునే అవకాశాలను కల్పించింది. దానితో జగన్ నిన్న పిఠాపురంలో భారీ బహిరంగ సభలో పాల్గొన్నారు. అందులో భాగంగా ఈయన పవన్ కళ్యాణ్ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. తాజాగా పిఠాపురం బహిరంగ సభలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతూ ... పిఠాపురం నుండి పోటీ చేస్తున్న నట పుత్రుడికి ఎందుకు ఓటు వేయద్దో నేను చెప్తాను... మీరందరూ కూడా చక్కగా విని ఎందుకు ఓటు వేయద్దు అనే విషయం గురించి ఆలోచించండి.
ఈ నట పుత్రుడిని నమ్మే మీరు కనుక ఆయనకు ఓటు వేస్తే ఆయన గెలిస్తే మీ గ్రామంలో అతను ఉంటాడా..? అస్సలు ఉండడు. మొన్న ఆయనకు జలుబు వేస్తే హైదరాబాదుకు వెళ్ళాడు. గెలిచాక కూడా ఆయన ఇక్కడ ఉండడు హైదరాబాదులోనే ఉంటాడు. ఇక ఈయనకు ఇప్పటికే గాజువాక అయిపోయింది, భీమవరం అయిపోయింది. ఆ రెండు ప్రాంతాలలో ఓడిపోయాడు. ఇక ప్రస్తుతం పిఠాపురం పై పడిపోయాడు.
ఈయన ఎందుకు ఎప్పుడు ప్రాంతాలను మారుస్తున్నాడు. దాని గురించి మీరంతా ఆలోచించాలి అని నేను మిమ్మల్ని అడుగుతున్నాను అని జగన్ అన్నారు. ఇలాంటి వ్యక్తికి మీరు కనుక ఓటు వేస్తే ఆ ఓటుకు న్యాయం జరుగుతుందా అని నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. నా అక్క మరియు తల్లి లాంటిది అయినటువంటి వంగ గీతను కనుక మీరు గెలిపించినట్లు అయితే ఆమెను డిప్యూటీ సీఎం చేసి మీ పిఠాపురం కు పంపిస్తాను అని జగన్ అన్నారు.
అ
లాగే ఐదు సంవత్సరాలకోసారి కారును మార్చినట్టుగా భార్యను మార్చే ఈ దత్తపుత్రుడు కి ఓటు వేస్తారా..? ఒకసారి జరిగితే పొరపాటు, రెండోసారి జరిగితే గ్రహపాటు, అదే మూడోసారి, నాలుగోసారి జరిగితే అలవాటు కాదా అని మిమ్మల్ని అడుగుతున్నాను. ఇలాంటి స్వభావం కలిగిన వ్యక్తి ఎమ్మెల్యే అయితే ఏదైనా పని కోసం నా అక్క, చెల్లెలు అతని దగ్గరికి వెళ్లే పరిస్థితి ఉంటుందా అని అడుగుతున్నాను అని జగన్ అన్నారు. ఇలా జగన్ పిఠాపురం సభలో పవన్ కళ్యాణ్ పై తనదైన రీతిలో విరుచుకుపడ్డారు.