పిఠాపురంలో విచిత్ర సంఘటన... డబ్బులు ఇవ్వలేదని పార్టీ కార్యాలయం ఎదుట నిరసన..!

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని పిఠాపురం నియోజకవర్గం ఎమ్మెల్యే అభ్యర్థిగా జనసేన అభ్యర్థిగా పవన్ కళ్యాణ్ పోటీ చేస్తూ ఉండడంతో రాష్ట్ర ప్రజల ఆసక్తి ఈ నియోజకవర్గం పై పడింది. ఇక పోయిన సారి రెండు నియోజకవర్గాల్లో పోటీ చేసి రెండింటిలో ఓడిపోవడంతో పవన్ ఈసారి కచ్చితంగా గెలవాలి అని దృఢ సంకల్పంతో ఉన్నాడు. దానితో తన బలాన్ని మొత్తం ఈ నియోజకవర్గంలో చూపిస్తున్నాడు. చాలా రోజుల క్రితం నుండే జబర్దస్త్ లోని ఎంతోమంది నటులు పవన్ కి సపోర్టుగా పిఠాపురంలో ప్రచారాలను చేశారు.


ఆ తర్వాత నాగబాబు, సాయి ధరమ్ తేజ్ , వరుణ్ తేజ్ లాంటి వారు కూడా పవన్ కి సపోర్టుగా ప్రచారం చేశారు. ప్రచారాలకు ఆఖరి రోజు అన్న నిన్న రామ్ చరణ్ తో పవన్ ఫైనల్ టచ్ ఇచ్చాడు. ఇలా పిఠాపురం నియోజకవర్గంలో పెద్ద ఆటే నడుస్తోంది. ఇంత పెద్ద గేమ్ పిఠాపురంలో నడుస్తూ ఉంటే జగన్ తన పార్టీ పిఠాపురం అభ్యర్థి అయినటువంటి వంగా గీతకు ఫుల్ సపోర్ట్ ఇస్తున్నాడు. నిన్న జరిగిన భారీ సభలో వంగ గీతను గెలిపిస్తే డిప్యూటీ సీఎం చేసి తన పక్కన కూర్చో పెట్టుకుంటాను అని కూడా జగన్ చెప్పాడు. అలాగే ఆమె కంటతడి పెట్టడంతో ఆమెకు కాస్త మైలేజ్ కూడా ఏర్పడింది.


ఇదంతా బాగానే ఉంది. అలాగే ఎలక్షన్లు వచ్చాయి అంటే డబ్బులు పంచే సంస్కృతి కూడా ఇప్పుడు పెద్ద సీరియస్ గా ఎవరూ తీసుకోవడం లేదు. దానితో ఒక పార్టీ వారు పంచితే అంతకంటే ఎక్కువ మరో పార్టీ పంచే సంస్కృతి ప్రస్తుతం నడుస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా ప్రస్తుతం డబ్బులను బాగానే పంచుతున్నట్లు తెలుస్తోంది. ఇక గీతా కూడా ప్రస్తుతం డబ్బులను పంచుతున్నట్లే తెలుస్తోంది. ఒక్కొక్కరు ఒక్కోరకంగా ఓటుకు డబ్బులు ఇస్తున్నట్లు చెప్పుకుంటున్నారు. ఒక్కో ఓటుకు ఎంత ఇస్తున్నారు అనేది మనకు క్లారిటీగా తెలియదు.


కాకపోతే పిఠాపురం నియోజకవర్గంలో ఒక విచిత్రమైన సంఘటన నెలకొంది. వంగ గీత కొంతమందికి మాత్రమే డబ్బులు ఇచ్చి మరి కొంతమందికి ఇవ్వలేదు అని ఆ నియోజకవర్గంలోని కొంతమంది ప్రజలు వైసీపీ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు. కొంత మందికి మాత్రమే డబ్బులు పంచారు అని, మరి కొంతమందికి ఇవ్వలేదు అని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇక డబ్బులు ఇచ్చే వరకు కదిలేది లేదు అని జనాలు అనడంతో పోలీసులు అక్కడికి వచ్చి వారందరిని తరిమికొట్టారు. ఇలా పిఠాపురంలోని వంగ గీత కార్యాలయం ముందు ఇలా విచిత్రమైన సంఘటన నెలకొంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: