విజయమ్మకు షర్మిల కంటే జగనే ఇష్టమా... ఎన్నికల వేళ అమ్మప్రేమ ఎంత పని చేసిందో చూడండి..!
కడప ఎంపీగా పోటీ చేస్తున్న కాంగ్రెస్ పీసీసీ చీఫ్ వై ఎస్ షర్మిల ను గెలిపించాలని.. గతం లో వైఎస్‌ను అక్కున చేర్చుకున్నట్టే ఇప్పుడు షర్మిలను కూడా గెలిపించాలని విజయమ్మ పిలుపునిచ్చారు . అయితే.. ఈ వీడియోపై అనేక విశ్లేషణలు వచ్చాయి. ఇంకేముంది.. ఆమె కుమారుడికి వ్యతిరేకంగా ఎలుగెత్తారని.. వైసీపీ పై ప్రభావం చూపిస్తున్నార ని.. జగన్ ఒంటరి అయిపోయారని కూడా అన్నారు .
అయితే. ఇక్కడ రెండు కీలక విషయాలను ప్రస్తావించాలి. ఒకటి) విజయమ్మ పిలుపునిచ్చారు నిజమే. తన కుమార్తెను, వైఎస్ ముద్దల బిడ్డ ను గెలిపించాలని ఆమె పిలుపునిచ్చారు. కానీ, ఎక్కడా విజయమ్మ.. కాంగ్రెస్ పేరు ఎత్తలేదు. హస్తం గుర్తుకు వోటేయాలని చెప్పలేదు. అంటే.. విజయమ్మ.. కాంగ్రెస్ పార్టీని అంగీకరించడం లేదనేది స్పష్టమవుతోంది. తమ కుటుంబానికి కాంగ్రెస్ అన్యాయం చేసిందన్న వాదనను ఆమె ఇప్పటికీ నమ్ముతున్నారనే భావించాలి.
రెండు) విజయమ్మ.. చేసిన ప్రసంగంలో ఎక్కడా కూడా.. జగన్‌ను ఓడించాలని కానీ.. వైసీపీని ఓడించాల ని కానీ.. జగన్‌కు ఓటేయొద్దని కానీ .. చెప్పలేదు. సో.. ఆమె తన తల్లి ప్రేమను అలానే పదిలంగా ఉంచుకు న్నారనేది ఈ వ్యాఖ్యలతో అర్థమవుతుంది. ఎలా చూసుకున్నా.. విజయమ్మ ఇచ్చిన సందేశంలో జగన్ పేరును ఎత్తలేదంటే.. ఆయనను ఓడించమని కాదు కదా! అలాగని ఓటేయాలని కూడా చెప్పలేదు. తటస్తంగానే వ్యవహరించారు. కాబట్టి. . జగన్ విషయంలో మాతృమూర్తి మమకారం అలానే ఉంద న్న విషయం క్లీయర్ కట్ గా తెలుస్తోంది.