దేశ పౌరుడికి ఉండే ముఖ్యమైన బాధ్యతల్లో ఓటు హక్కును వినియోగించుకునే బాధ్యత కూడా ఒకటి. చాలా మంది ఓటు వేసే ఊరికి చాలా దూరంగా ఉన్నాము. అనవసరంగా వెళ్లి ఓటు వేసేయడం వల్ల డబ్బులు ఖర్చు అవుతాయి, అలసిపోతాము అనే చిన్న చిన్న కారణాల వల్ల ఓటును వినియోగించుకోరు. అలాగే మరి కొంత మంది ఓటు స్లిప్ రాలేదు అని కూడా ఓటు హక్కును వినియోగించుకోరు.
అలాగే మరి కొంత మంది మాకు ఓటు స్లిప్ రాలేదు, బూత్ దగ్గరికి వెళితే ఏమంటారో... మాకు సరిగ్గా సహకరిస్తారో లేదో అని అనుమానలతో కనీసం పోలింగ్ బూత్ వరకు కూడా వెళ్లారు. అలాగే మరి కొంత మంది పోలింగ్ బూత్ వరకు వెళ్లి తమ ఓటు హక్కును వేరే వాళ్ళు వినియోగించుకున్నారు లాంటి విషయం తెలిస్తే షాక్ అయ్యి చేసేదేమీ లేదు అని బయటికి వెళ్లి వస్తా ఉంటారు.
ఇకపోతే ఈ రోజు దేశ వ్యాప్తంగా భారీ ఎత్తున ఎలక్షన్ లు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. అందుకోసం మీరు కొన్ని విషయాలను తెలుసుకోవాల్సి ఉంటుంది. ఒక వేళ మీరు గనక పోలింగ్ బూత్ వరకు వెళ్లి మీ ఓటు హక్కును వినియోగించుకోవాలి అనుకున్న సందర్భంలో మీ ఓటును వేరే వాళ్ళు వేశారు అన్నట్లు అయితే మీరు వెంటనే తిరిగి అక్కడి నుండి వెళ్లి రాకండి. మీ ఓటు వేరే వాళ్ళు వినియోగించిన దానిని మీరు మళ్ళీ వేయవచ్చు. అది ఎలాగో మనం తెలుసుకుందాం. మీ ఓటును వేరే వాళ్ళు కనుక వేసినట్లు మీరు గుర్తించినట్లు అయితే వెంటనే ప్రిసైడింగ్ అధికారిని కలవాలి.
అతనికి ఓటర్ ఐడి లేదా మరేదైనా గుర్తింపు పత్రాన్ని సమర్పించాలి. అధికారి ఇచ్చే ఫామ్ 17 (బి) పై మీ పేరు రాసి సంతకం చేయాలి. ఆ తర్వాత టెండర్ బ్యాలెట్ పేపర్ ఇస్తారు. దానిపై మీరు ఓటు వేయాలి. ఆ పేపర్ ను ప్రత్యేక కవర్లో కౌంటింగ్ కేంద్రానికి పంపిస్తారు. సెక్షన్ 49 (పి) ప్రకారం పొందే ఈ ఓటును టెండర్ లేదా చాలెంజిన్ ఓటు అంటారు. కాకపోతే దీనిని ఈవీఎం ద్వారా వేయడం కుదరదు.