పుంగనూరు పెద్దిరెడ్డి పెద్దారెడ్డైనట్టేనా ?
ప్రజల కోసం డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు పెడుతూ, రైతులకు ఉచితంగా పాడి ఆవులను కూడా ఇస్తానని ప్రాణాలు పెట్టడానికి ప్రయత్నించారు. సంక్రాంతి పండుగ వేళా ముగ్గుల పోటీలు పెట్టి ఆ నియోజకవర్గ మహిళలకు చాలానే డబ్బులు అందించారు. ఆ ప్రాంతంలో బాగా తిరుగుతూ ప్రజలకు దగ్గరయ్యారు. ఇంత చేసినా పోల్ మేనేజ్‌మెంట్ విషయంలో అత్యంత బలమైన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ముందు మాత్రం ఆయన తేలిపోయారు. ఆఖరి రోజుల్లో ఆయన పెద్దిరెడ్డి వలె ప్రజలకు దగ్గర కాలేకపోయారు. కట్ చేస్తే ఇప్పుడు ప్రజలందరూ పెద్దిరెడ్డికే ఓట్లు వేస్తున్నట్లు తెలుస్తోంది. ఆ వాతావరణం అలాగా కనిపిస్తోందని రాజకీయ విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
దీన్ని బట్టి పుంగనూరుకు పెద్దిరెడ్డి పెద్దారెడ్డిగా అవతరించవచ్చని తెలుస్తోంది. పెద్దిరెడ్డికి పోటీ ఎవరూ రారని కూడా ఈ విజయంతో స్పష్టమైన మెసేజ్ అందరికీ వెళ్ళిపోతుందని కూడా చెప్పుకోవచ్చు. జగన్‌కు పెద్దిరెడ్డి చాలా కావాల్సిన మనిషి. అందుకే చాలామంది నేతలను మూడేళ్లకే మంత్రి పదవిలో నుంచి తీసేసిన పెద్దిరెడ్డిని మాత్రం ఐదేళ్లు మంత్రి గానే ఉంచారు. పెద్దిరెడ్డి ఫ్యూయల్, అటవీ, పర్యావరణం, సైన్స్ & టెక్నాలజీ, గనులు, భూగర్భ శాస్త్రాల మంత్రిగా ఐదేళ్లు పనిచేశారు. ఎలాంటి అపాయింట్మెంట్ లేకుండా జగన్ వద్దకు వెళ్లగల ఏకైక నాయకుడు పెద్దిరెడ్డి. పెద్దిరెడ్డి తనయుడు మిథున్ కుమార్ రెడ్డి కూడా వైసీపీలో ఎంపీగా కొనసాగుతున్నారు వీరిద్దరూ ఫైనాన్షియల్ గా జగన్‌కు ఎంతో సపోర్ట్ చేశారు. 2019లో కూడా డబ్బులు పరంగా జగన్ కి ఏ లోటు రాకుండా చూసుకున్నారు.