రాజానగరం: జక్కంపూడోడు జనసేన గ్లాస్‌ను పగలగొట్టి గెలిచేశాడా..?
ఈసారి అసెంబ్లీ ఎన్నికలలో వైసీపీ, జనసేన మధ్య పెద్ద పోటీ నడుస్తోంది. ముఖ్యంగా గోదావరి జిల్లాలలో నరాలు తెగేంత ఉత్కంఠతో ఈ రెండు పార్టీల మధ్య సమరం జరుగుతోంది. ముఖ్యంగా రాజానగరం నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి, జనసేన అభ్యర్థి మధ్య హోరా హోరీగా పోటీ జరుగుతోంది. రాజమండ్రి పక్కనే, రాజమండ్రి పార్లమెంటు పరిధిలో ఈ ప్రాంతం ఉంటుంది. ఫ్యాన్, గాజు పార్టీల మధ్య ఎవరు గెలుస్తారనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. ఈసారి జక్కంపూడి రాజా ఇంద్రవందిత్ వైసీపీ పార్టీ తరఫు నుంచి పోటీ చేస్తున్నారు. జక్కంపూడి రాజా 2019లో అసెంబ్లీ ఎన్నికల్లో ఈ నియోజకవర్గం నుంచి ఆల్రెడీ ఎమ్మెల్యేగా గెలిచి తన సత్తా చాటారు.
2024లో ఆ సీట్ నుంచి పోటీ చేసే అవకాశాన్ని అధిష్టానం మళ్ళీ అతనికే అందజేసింది. అయితే ఈసారి కూడా అతను గెలిచి లాగానే కనిపిస్తున్నారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి పొత్తులో భాగంగా జనసేన నాయకుడు బత్తుల బలరామకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నారు. ఈయన జక్కంపూడి రాజా దగ్గర పనిచేశారు. ఇంతకుముందు వైసీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. ఇప్పుడు జనసేన పార్టీలో కలిసి జక్కంపూడి రాజాకి ప్రత్యర్థిగా నిలుస్తున్నారు. బత్తుల బలరామకృష్ణ ఎప్పుడూ చాలా కాంట్రవర్సీలలో ఉంటూ వస్తున్నారు. ఆయన పెట్టుకునే వివాదాలను చూసి ఆయనను భరించలేక జక్కంపూడి రాజా నే అతనిని బయటికి పంపించేశారు.
అయితే బత్తుల బలరామకృష్ణ ఈ నియోజకవర్గంలో గెలవడానికి డబ్బులను విచ్చలవిడిగా ప్రజలకు పంచిపెట్టారు. కానీ ఆయన గెలిచే అవకాశాలు శూన్యమని తెలుస్తోంది. చివరికి టీడీపీ కమ్మ సామాజిక వర్గానికి చెందిన వారు కూడా బలరామకృష్ణకు ఓటు వేసే అవకాశం లేదట. జక్కంపూడి ఫ్యామిలీ పైనే కమ్మ సామాజిక వర్గానికి ప్రేమ ఉందని, అందుకే వారికే ఓట్లు వేస్తున్నట్లు సమాచారం. ఈ నియోజకవర్గ పరిస్థితి గురించి సింపుల్ గా చెప్పాలంటే రాజానగరంలో జక్కంపూడోడు జనసేన గ్లాస్‌ను పగలగొట్టి ఘన విజయం సాధించినట్లే.