ఏపీ: ఓటమి బాధలో గొడవలకు తెరలేపిన టీడీపీ .. ఏకిపారేసిన సజ్జల..?
టీడీపీ కయ్యానికి కాలు దువ్వుతున్నా వైసీపీ కార్యకర్తలు, నేతలు చాలా సంయమనంతో ప్రవర్తిస్తున్నట్లు తెలిపారు. పోలింగ్ కేంద్రాల వద్ద శాంతియుత వాతావరణం ఉండేలాగా చూస్తూ ఎక్కువ పోలింగ్ నమోదు అయ్యేటట్టు చేస్తున్నారని సజ్జల వివరించారు. గంగాధర నెల్లూరు, విశాఖ వెస్ట్ నియోజకవర్గాల్లో బౌన్సర్లను తీసుకొచ్చి టీడీపీ నేతలు పిచ్చిపిచ్చిగా వ్యవహరించారని కూడా సజ్జల కోపం వ్యక్తం చేశారు. ఈ నేతలపై అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర ఎన్నికల చరిత్రలో బౌన్సర్లను దింపిన ఏకైక పార్టీ టీడీపీయే అని ఆయన ఫైర్ అయ్యారు.
టీడీపీ రౌడీయిజం గురించి మాట్లాడడంతో పాటు ఈవీఎంల సాంకేతిక సమస్యల గురించి కూడా సజ్జల రామకృష్ణ మాట్లాడారు. కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయని మరికొన్ని చోట్ల ఈవీఎంలు చాలా నెమ్మదిగా పనిచేస్తున్నాయని, ఈ సమస్యలకు తక్షణమే పరిష్కారం చూపాలని కారులను కోరారు. వీటివల్ల వృద్ధులు బాగా ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు.
ప్రస్తుతం ఎండ వేడిమి ఎక్కువగా ఉందని వృద్ధులు వేడి వాతావరణంలో నిలబడలేక పోతున్నారని పేర్కొన్నారు. కొంతమంది ఎన్నికల అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్లే ఈ సమస్యలు తలెత్తుతున్నాయని, తగిన చర్యలు తీసుకోవాలని అభ్యర్థించారు. అయితే ప్రస్తుతం టీడీపీపై చేసిన సజ్జల ఆరోపణలు ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్లో హాట్ టాపిక్ గా మారాయి.