ఏపీ: హిందూపురంలో హై టెన్షన్.. కత్తులతో దాడులు..??

Suma Kallamadi
ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుతం అసెంబ్లీ ఎన్నికలు కొనసాగుతున్నాయి. అయితే ఓటమి భయంతో ఉన్న టీడీపీ నేతలు కర్రలు ఇనుపరాట్లు పెట్టుకొని దాడులకు పాల్పడుతున్నారు రాళ్లు విసురుతూ తీవ్రమైన హింసాత్మక ఘటనాలకు దారి తీస్తున్నారు. భయానక వాతావరణాన్ని సృష్టిస్తూ ఎవరూ కూడా ఓటు క్యాస్ట్ చేయకుండా చేస్తున్నారు. బాలకృష్ణ ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న హిందూపురంలో కూడా హై టెన్షన్ నెలకొన్నది. ఇక్కడ మీరు పార్టీల కార్యకర్తలు చచ్చేటట్టు కొట్టుకున్నారు.

ఇక్కడ వైసీపీ నేత, చిలమత్తూరు ఎంపీపీ పురుషోత్తమ రెడ్డిపై టీడీపీ రౌడీలు భయంకరమైన అటాక్‌ చేశారు. వైసీపీ నేతల కార్లపై రాళ్లు రువ్వుతూ రెచ్చిపోయారు. వీరి దాడిలో రెండు కార్లు చిత్తు చిత్తుగా మారాయి. దాడిలో వైసీపీ కార్యకర్త నవీన్ బాగా గాయపడ్డాడు.మండికృష్ణాపురం పంచాయతీలో వైసీపీ బూత్ ఏజెంట్లపై టీడీపీ నేతలు కత్తితో ఎటాక్ చేశారు. ఈ ఘటనలో ఓ వైసీపీ బూత్ ఏజంట్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు అతడిని హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ఇంకా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. వీటిని ఆపేందుకు పోలీసులు రబ్బరు బుల్లెట్లు వాడుతున్నారు. అలాగే లాఠీ ఛార్జ్ చేస్తూ ఇరు వర్గాల కార్యకర్తలను చెదరగొడుతున్నారు.

 ఇకపోతే హిందూపురంలో బాలకృష్ణ గెలిచే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి వైసీపీ అభ్యర్థి టీఎన్ దీపిక బాలకృష్ణ కు పోటీగా రంగం లోకి దిగారు కానీ బాలకృష్ణ ఈ నియోజకవర్గ ప్రజలకు చాలా మంచి చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు కూడా తన సొంత నిధులతో నియోజకవర్గాన్ని డెవలప్ చేశారు ఆ కారణం చేత ప్రజలు బాలయ్య బాబు వైపే మొగ్గు చూపారు. ఓటు వేసిన తర్వాత బాలకృష్ణ కూడా ఇదే విశ్వాసాన్ని వ్యక్తం చేశారు తాను కచ్చితంగా ఈ నియోజకవర్గంలో గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. ఆల్రెడీ రెండుసార్లు బాలకృష్ణ ఇక్కడి నుంచి పోటీ చేసి గెలిచారు. ఈసారి గెలిస్తే హ్యాట్రిక్ కొట్టినట్లే అవుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: