నరసరావుపేటలో ఆ పార్టీ గెలుపు అవకాశాలను తగ్గించడానికే ఈ గొడవలా..?

Pulgam Srinivas
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఈ రోజు అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతున్న విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ఈ రోజు ఉదయం 6 గంటలకు ఉండే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు మొదలు అయ్యాయి. అందులో భాగంగా పల్నాడు జిల్లాలోని నరసరావుపేట లో కూడా ఓటింగ్ ప్రక్రియ ఉదయం ఆరు గంటల నుండి యధా విధంగా ప్రారంభం అయింది. ఇక మొదటి నుండి ఈ ప్రాంతంలో ఓటింగ్ ప్రక్రియ ఎంతో సజావుగా సాగింది. ఏవో చిన్న చిన్న సంఘటనలు మినహాయిస్తే పెద్ద సంఘటనలు ఏమీ ఇక్కడ చోటు చేసుకోలేదు.

ఇకపోతే ప్రస్తుతం మాత్రం ఇక్కడ ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఈ ప్రాంతంలో మొదటి నుండి టీడీపీ , వైసీపీ  మధ్య భారీ పోరు నెలకొని అవకాశాలు ఉన్నాయి అని అనేక మంది జనాలు అంచనా వేశారు. నరసారావు పేట వైసీపీ అభ్యర్థిగా గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి బరిలో నిలవగా ... కూటమి అభ్యర్థిగా చదలవాడ అరవింద బాబు బరిలో ఉన్నారు. వీరిద్దరు కూడా చాలా రోజుల నుండే ఈ ప్రాంతంలో ప్రచారాలను చేశారు. అలాగే ఈ ప్రాంతంలో వీరికి గట్టి పట్టు ఉండడంతో ఈ ఇద్దరి మధ్య గట్టి పోటీని నెలకొనే అవకాశాలు ఉన్నాయి అని కూడా జనాలు అంచనా వేశారు.

ఇకపోతే ఈ ప్రాంతంలో ఈ రోజు మధ్యాహ్నం 3 గంటల వరకు ఎన్నికలు చాలా సజావుగానే సాగాయి. కానీ ఆ తర్వాత టీడీపీ , వైసీపీ నేతల మధ్య ఘర్షణ నెలకొంది. ఈ ఘర్షణ తార స్థాయికి చేరడంతో పోలీసులు ఇందులో చొరవ చేసుకోవాల్సి వచ్చింది. అల్లరి మూకల గొడవలు ఎక్కువ కావడంతో రబ్బర్ బుడేట్లతో వారిని చెల్లాచెదురు చేసి గొడవలను పోలీసులు తగ్గించారు. ఇక ఈ గొడవలో భాగంగా వైసీపీ కార్యకర్తలు టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి అయినటువంటి చదలవాడ అరవింద్ బాబు ఇంటి పై దాడి కూడా చేసినట్లు తెలుస్తోంది.

ఇక మరో అర్థగంట మాత్రమే పోలింగ్ కి సమయం ఉండడంతో పోలీసులు ఓటర్లకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఓట్లు వేసుకునేందుకు వీలుగా పరిస్థితులను తీసుకువస్తున్నట్లు తెలుస్తుంది. ఇక ఈ గొడవ కావడానికి ప్రధాన కారణం కొన్ని మీడియా సంస్థల కథనాల ప్రకారం... టీడీపీ పార్టీకి ఉదయం నుండి భారీగా ఓట్లు పడ్డాయి అనే ఉద్దేశంతో వైసీపీ పార్టీ నేతలు ఇకపై పడే ఓట్లను ఆపాలి అనే కారణంతో గొడవను సృష్టించినట్లు ఆ గొడవ తారాస్థాయికి చేరినట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: