ఆరా మస్తాన్ సర్వేతో ఏపీ సీఎం ఎవరో తేలిపోయిందిగా.. ఆ జననేతకే ఛాన్స్!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే సీఎం ఎవరు అనే చర్చ ఏపీ ఓటర్ల మధ్య జరుగుతోంది. 75 శాతం మంది తాము ఫ్యాన్ గుర్తుకు ఓటేశామని చెబుతుండగా 25 శాతం మంది మాత్రం కూటమికి ఓటేశామని చెబుతున్నారు. ఇప్పటికే ఎన్నో సర్వే సంస్థలు తమ సర్వేలకు సంబంధించిన ఫలితాలను వెల్లడించిన సంగతి తెలిసిందే. అయితే ఆరా మస్తాన్ సర్వేతో ఏపీ సీఎం ఎవరో తేలిపోయిందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.
 
వైసీపీ గెలుపు ఖాయమని ఆరా మస్తాన్ చెప్పకనే చెప్పేశారు. ఆయన కామెంట్లతో వైఎస్ జగన్ మళ్లీ సీఎం కావడం లాంఛనమే అని నెటిజన్ల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఓటర్లు సామాజికవర్గాల వారీగా విడిపోయిన పరిస్థితి కనిపిస్తోందని ఆరా మస్తాన్ అన్నారు. బీసీ, ఎస్సీలు, మాల, మాదిగ, ముస్లిం, రెడ్డి సామాజికవర్గాల మద్దతు ఒక రాజకీయ పార్టీకి ఉందని ఆయన తెలిపారు.
 
మహిళల్లో ఎక్కువమంది వైసీపీకి మద్దతు తెలుపుతున్న పరిస్థితి నెలకొందని ఆరా మస్తాన్ చెప్పుకొచ్చారు. ప్రభుత్వం నుంచి మహిళలకు ఎక్కువ సంఖ్యలో సంక్షేమ పథకాలు అమలు అవుతున్నాయని ఆరా మస్తాన్ కామెంట్లు చేశారు. ఎంత టైట్ వాతావరణం వచ్చినా ఫలితం మాత్రం ఏకపక్షంగానే ఉంటుందని ఆయన తెలిపారు.
 
తెలంగాణ ఎన్నికలను ఖచ్చితంగా అంచనా వేసిన ఆరా మస్తాన్ ఏపీ ఫలితాలను సైతం కచ్చితంగా అంచనా వేస్తున్నారని ఆయన అంచనా నిజం అవుతుందని చెప్పడంలో ఏ మాత్రం సందేహం అవసరం లేదని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. ఆరా మస్తాన్ సర్వే ఫలితాలు వైసీపీలో జోష్ నింపగా కూటమి నేతలను మాత్రం తీవ్రస్థాయిలో నిరాశకు గురి  చేస్తున్నాయని తెలుస్తోంది. తమకు అనుకూలంగా సర్వే ఫలితాలు చెప్పాలని ఆరా మస్తాన్ పై టీడీపీ నేతలు ఒత్తిడి తెచ్చినట్టు వార్తలు జోరుగా ప్రచారంలోకి వస్తుండటం గమనార్హం. ఎగ్జిట్ పోల్స్ సర్వే ఫలితాలు సైతం వైసీపీకి అనుకూలంగా ఉండనున్నాయని తెలుస్తోంది.


మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: