ఆంధ్రప్రదేశ్ లో సార్వత్రిక ఎన్నికలు ముగిసాయి.. ఇన్ని రోజుల నుండి ఇంటింటికి తిరిగి ప్రచారం చేసిన నాయకులు ఇక కనపడరు. ఎలక్షన్స్ కు ముందు ఎవ్వరు చేయలేనన్ని హామీలు ఇచ్చిన పార్టీలు ఓడిపోగానే ఎవ్వరికి కనపడరు.. అయితే ఈ సారి ఎలక్షన్స్ చాలా భిన్నంగా జరిగాయి. మండుటెండ జోరు వానను సైతం లెక్కచేయకుండా ఓటర్లు పోలింగ్ బూత్ లకు తరలి వచ్చి తమ నాయకుడిని ఎన్నుకున్నారు. గతంలో కంటే కూడా ఈసారి పోలింగ్ శాతం పెరిగింది.. అయితే రాష్ట్రంలో ఈ సారి కూడా ఓటరు తమకోసం నిలబడే నాయకుడికే ఓటు వేసినట్లు తెలుస్తుంది. తమకు డబ్బు ఆశ చూపించిన కూడా సామాన్య ఓటరు తమ కోసం కష్టపడే నాయకుడినే ఎన్నుకున్నట్లు తెలుస్తుంది. అయితే మిగిలిన రాష్ట్రాలలో ఎలక్షన్స్ వేరు ఒక ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు వేరు.. మిగిలిన రాష్ట్రాలలో అధికార, ప్రతి పక్ష పార్టీలు మ్యాజిక్ ఫిగర్ కోసం తీవ్రంగా పోటీని ఇస్తాయి..
కానీ ఆంధ్రప్రదేశ్ లో మాత్రం మ్యాజిక్ ఫిగర్ కాదు అంతకు మించి సీట్లు ఒకే పార్టీకి లభిస్తాయి.. గత ఎన్నికలను చూసుకుంటే 2014లో టీడీపీకి 100కు పైగా సీట్లు వచ్చాయి.. అలాగే 2019 లో ఎవరు ఊహించని విధంగా వైసీపీ 151 సీట్లు సాధించి సంచలనం సృష్టించింది. అయితే ఈ సారి కూడా రాష్ట్రంలో ఒకే పార్టీకి భారీగా సీట్లు లభించే అవకాశం ఉంది. అయితే రాష్ట్రంలో వైఎస్ జగన్ కు ఎంత వ్యతిరేకత వున్నా కూడా ఈ సారి ఆయనే మళ్ళీ గద్దెనెక్కే అవకాశం స్పష్టంగా కనిపిస్తుంది.రాష్ట్రంలో ఉద్యోగులు, నిరుద్యోగులు జగన్ కు పూర్తి వ్యతిరేకతగా వున్నారు.. వారు ఈ సారి కచ్చితంగా జగన్ కు వ్యతిరేకంగా ఓటును వేసి వుంటారు.. జగన్ కు వున్న బలమంతా కూడా రాష్ట్రంలోని బడుగు, బలహీన వర్గాల మహిళలు, అలాగే పెన్షన్ తీసుకునే అవ్వ తాతలు.. ఈ సారి వారి సాయంతోనే జగన్ ఊహించని సీట్లు సాధించి మళ్ళీ అధికారంలోకి రానున్నారు.