దేశంలో నిన్న నాలుగో విడత సార్వత్రిక ఎన్నికలు కొన్ని రాష్ట్రాలలో జరిగాయి. అందులో భాగంగా నిన్న 4 వ విడతగా జరిగిన ఎన్నికలలో కొన్ని రాష్ట్రాలలో అద్భుతమైన ఓటింగ్ శాతాలు నమోదు కాగా మరికొన్ని రాష్ట్రాలలో పరవాలేదు అనే స్థాయిలో మాత్రమే ఓటింగ్ శాతం నమోదు అయింది. మరి 4 వ విడత సార్వత్రిక ఎన్నికలు ఏ ఏ రాష్ట్రాల్లో జరిగాయి. అందులో ఏ రాష్ట్రంలో ఎంత శాతం ఓటింగ్ నమోదు అయ్యింది అనే వివరాలను తెలుసుకుందాం. నిన్న దాదాపు రాత్రి 11 గంటల 45 నిమిషాల వరకు కొన్ని రాష్ట్రాలలో ఎలక్షన్ లు జరిగాయి.
ఆ లెక్కల ప్రకారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో నిన్న అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరిగాయి. అందులో భాగంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 78.25 శాతం ఓటింగ్ జరిగింది. ఇక నిన్న నాలుగవ విడత సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా బీహార్ లో కూడా ఎలక్షన్ లు జరగగా ఇక్కడ 57.06 శాతం ఓటింగ్ జరిగింది. ఇక జమ్మూ కాశ్మీర్ లో 37.98 శాతం ఓట్లు పోల్ కాగా ... జార్ఖండ్ లో 65.31 శాతం ఓట్లు పడ్డాయి. మధ్య ప్రదేశ్ లో 70.98 శాతం ఓట్లు పోల్ కాగా ... మహారాష్ట్ర లో 15.64 శాతం , ఒడిశా లో 73.97 శాతం , తెలంగాణ లో 64.93 శాతం , ఉత్తర ప్రదేశ్ లో 58.05 శాతం , పశ్చిమ బెంగాల్ లో 78.44 శాతం పోలింగ్ నమోదు అయ్యింది.
ఇకపోతే నిన్న జరిగిన ఎన్నికల్లో అత్యధికంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 78.25 శాతం ఓట్లు పోల్ కాగా ... అత్యల్పంగా జమ్మూ కాశ్మీర్ లో 37.98 శాతం మాత్రమే ఓట్లు పోల్ అయ్యాయి. ఇక ఇన్ని రోజుల పాటు హోరా హోరీగా ఈ రాష్ట్రాలలో ప్రచారాలు జరిగాయి. ఇక నిన్నటి తో ఎలక్షన్ లు పూర్తి అయ్యాయి. దానితో నేతలు అంతా సైలెంట్ అయిపోయారు. ఇక రిజల్ట్ డే కోసం నేతలంతా ఎదురు చూస్తున్నారు. రిజల్ట్ డే రోజు వచ్చే విజయాలను బట్టి మళ్ళీ ఏ పార్టీ ఎలాంటి పరిస్థితులను ఎదుర్కొంటుందో చెప్పవచ్చు.