కేసీఆర్ నోట ఆ సంచలన మాట వెనుక రహస్య వ్యూహం?
అసలు ఖాతా తెరవకపోయినా ఆశ్చర్య పడాల్సిన పనిలేదని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. ఇలాంటి వేళ కేసీఆర్ నోటి నుంచి ప్రదాని రేసు మాట రావడం ఒకింత ఆశ్చర్యమే. ప్రతి ఎన్నికల సమయంలోను ఏదో ఒక భావోద్వేగ అంశాన్ని తెరపైకి తెచ్చి లబ్ది పొందే వ్యూహాన్ని కేసీఆర్ అమలు చేస్తారన్న విషయం మనందరికీ తెలిసిందే.
కానీ ఈ ఎన్నికల్లో మాత్రం దీనికి భిన్నమైన పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో అధికారంలో లేకపోవడం, తమకు వచ్చే పరిమిత సీట్లతో ఏం చేయలేని స్థితి వెరసి.. పన్నెండు స్థానాలు ఇస్తే కేంద్రంలో చక్రం తిప్పి రాష్ట్ర రాజకీయాల్ని శాసిస్తామని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టారు. అయినా ప్రజల్లో ఎలాంటి సానుకూల స్పందన రాలేదు. 2018 ఎన్నికల్లో ఘన విజయం సాధిస్తేనే ఆ పార్టీకి తొమ్మిది ఎంపీ సీట్లకు పరిమితం అయింది. అలాంటిది ప్రస్తుత పరిస్థివతుల్లో ఐదు సీట్లు వస్తేనే అద్భుతం అవుతుందని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
మొత్తానికి కేసీఆర్ నోటి వెంట వచ్చిన ప్రధాని మాటకు ఏమైనా లాజిక్ ఉందా అంటే లేదనే అనిపిస్తోంది. ఇలాంటి వ్యాఖ్యలు కేసీఆర్ స్థాయిని మరింత దెబ్బతీస్తాయని పలువురు పేర్కొంటున్నారు. అయితే ఇది ఓటర్లను ఆకట్టుకునేందుకు వేసిన ఎత్తుగడగా అభివర్ణిస్తున్నారు. కనీసం ఈ మాటతో అయినా తాము గెలిచే వీలున్న సీట్లలో విజయం సాధించవచ్చని కేసీఆర్ ఆలోచనగా చెబుతున్నారు. మొత్తం మీద కేసీఆర్ నోటి వెంట ప్రధాని రేసు మాట తెలంగాణ ప్రజల మధ్య సరికొత్త చర్చకు దారి తీసింది.