తెలంగాణ పల్స్.. అంతా అయిపోయింది.. బిఆర్ఎస్ చాప చుట్టేయ్యాల్సిందేనా?

praveen
ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు సార్లు అధికారాన్ని చేజిక్కించుకుని తిరుగులేని పార్టీగా అవతరించిన బిఆర్ఎస్ ఒకసారి ప్రతిపక్షంలోకి రాగానే .. విపత్కర పరిస్థితులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఎందుకంటే అధికారంలో ఉన్న కాంగ్రెస్ కారు పార్టీలోని కీలక నేతలు అందరిని ఆకర్షించడంలో సక్సెస్ అయ్యింది. అయితే బిఆర్ఎస్ అధికారంలో ఉన్నప్పుడు ఉపముఖ్యమంత్రి సహా మరిన్ని కీలక పదవులను అనుభవించిన కడియం శ్రీహరి లాంటి నేతలు సైతం పార్టీని వేయడంతో ఇక గులాబీ పార్టీలో.


 సిట్టింగ్ ఎంపీలు సైతం ఇక మరోసారి టికెట్ వస్తుంది అనే ఆశించకుండా అధికార కాంగ్రెస్ లోకి వెళ్లిపోయారు. ఇంకోవైపు గ్రౌండ్ లెవెల్ లో ఉన్న బిఆర్ఎస్ నేతలు.. అయితే ఇక భారీగా అధికార పార్టీలోకి తరలి వెళ్లడం కూడా సంచలనంగా మారిపోయింది. ఇలాంటి పరిస్థితుల్లో గెలుపు కాదు.. కనీసం పార్టీని నిలబెట్టుకోగలమా అనే అనుమానం కూడా ఒకానొక సమయంలో కలిగింది. ఇలాంటి సమయంలో పార్లమెంట్ ఎన్నికలకు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంది బిఆర్ఎస్ పార్టీ. కేటిఆర్, హరీష్ రావు, కేసీఆర్ కార్నర్ మీటింగ్లు రోడ్ షోలు అంటూ ఇక తమ అభ్యర్థుల తరఫున తెగ ప్రచారం చేశారు. ఇక కెసిఆర్ ఏకంగా 13 పార్లమెంట్ నియోజకవర్గాలలో రోడ్ షోలు నిర్వహించడం గమనార్హం.


 ఎన్ని చేసినా అటు బిఆర్ఎస్ గెలుస్తుంది అని నమ్మకం మాత్రం లేకుండా పోయింది. ఎందుకంటే కేసిఆర్ సొంత జిల్లా అయిన మెదక్ పార్లమెంట్ నియోజకవర్గం లో గెలుస్తామని ధీమా వ్యక్తం చేస్తున్న బీఆర్ఎస్ కీలక నేతలు మిగతా స్థానాలలో గెలుపు పై మాత్రం అదే ధీమాని కనపరచలేకపోయారు. అదే సమయంలో తమ పార్టీ అభ్యర్థులను గెలిపిస్తే ఇక పార్లమెంటులో ఏం చేస్తాము అనే విషయంపై కూడా స్పష్టమైన హామీలు ఇవ్వలేకపోయారు. ఇక ప్రత్యేక మేనిఫెస్టోను కూడా విడుదల చేయలేదు. అధికార కాంగ్రెస్ ఫై విమర్శలు చేయడం తప్ప ఈ పార్లమెంట్ ఎన్నికల్లో బిఆర్ఎస్ ఎలాంటి ప్రత్యేకమైన వ్యూహాలను అనుసరించలేదు. ఇంకోవైపు రైతు రుణమాఫీ చేయలేదు.. రైతుబంధు వేయలేదు అంటూ రైతులను తమ వైపుకు తిప్పుకునేందుకు బిఆర్ఎస్ ప్రయత్నించిన.. ఎన్నికలకు ముందే రైతుబంధు ఖాతాలలో జమ చేయడం ఆగస్టు 15 లోపు రెండు లక్షల రైతు రుణమాఫీ చేస్తామని రేవంత్ శపథం చేయడంతో ఇక రైతులు కూడా బిఆర్ఎస్ ను కాదని మళ్లీ కాంగ్రెస్ వైఫై నిలిచారు. ఇక ప్రస్తుత పరిస్థితులు చూస్తుంటే కారు పార్టీ కనీసం ఒక్క సీటులో అయినా విజయం సాధిస్తుందా లేదా అనే నమ్మకమే లేకుండా పోయింది. ఇక దీంతో కారు పార్టీ పని అయిపోయిందని ఇక చాప చుట్టేయాల్సిందే అంటూ కాంగ్రెస్ శ్రేణులు కామెంట్ చేస్తూ ఉన్నారు. ఏం జరుగుతుందో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: