గత చరిత్రలో ఎప్పుడు లేనివిధంగా 80 శాతం పోలింగ్ నమోదు కావడంతో గెలుపు అనేది ఏ పార్టీకి వరిస్తుందో ప్రజలు తీవ్ర ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.సత్తెనపల్లి నియోజకవర్గంలోని వైఎస్ఆర్సీపీ పార్టీ ఆఫీసులో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో టీడీపీ చర్యలపై మండిపడ్డారు మంత్రి అంబటి.మొన్న జరిగిన పోలింగ్పై స్పందిస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌ను మళ్లీ సీఎం చేయాలనే తపన ఓటర్లలో కనిపించిందని అన్నారు.మహిళలు, వృద్ధులు, దివ్యాంగులు పెద్ద సంఖ్యలో ఓటేశారన్నారు.పోలింగ్ శాతం పెరగడం అంటే అది పాజిటివ్ ఓటింగ్ అన్నారు. మహిళా సాధికారత కోసం జగన్ కృషి చేశారని తెలిపారు. సీఎం జగన్ చేసిన కృషి వల్లే మహిళలు పెద్ద ఎత్తున తరలివచ్చారని చెప్పారు. ఎన్నికల్లో నమోదు అయ్యే పోలింగ్ శాతం అనేది గెలుపు, ఓటములను దాదాపుగా నిర్దేశించే పరిస్థితి ఉంది. ఇదిలా ఉంటే ఉద్యోగులు, కార్మికులు, మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి, కాపు, కమ్మ కులాల ఓటర్లు గంప గుత్తగా కూటమికి ఓటు వేశారని ఆయా పార్టీలు చెప్పుకుంటున్నాయి.ఐతే బీసీ, ఎస్సీ, ఎస్టీ, ముస్లిం, రెడ్డి సామాజిక వర్గాల ఓటర్లు, సంక్షేమ పథకాలు తీసుకున్న వాళ్లందరు తమకే మద్దతిచ్చారని వైసీపీ చెప్పుకుంటోంది. ఐదేళ్లుగా కులాలు, పార్టీలు, ప్రాంతాలు చూడకుండా అందరికీ సంక్షేమం అందించిన పార్టీ తమదేనని అన్నారు. ఒకవేళ ఇదే నిజమైతే ఓటర్ల మద్దతు వైసీపీకే అని చెప్పుకోవచ్చు.సాధారణంగా ఐదేళ్లు పరిపాలన తరువాత ఇది జరగలేదు, అది జరగలేదు అనే వ్యతిరేకత ఉంటుంది.. కానీ ఈ ప్రభుత్వంలో ప్రభుత్వ వ్యతిరేకతే లేదని స్పష్టం చేశారు.పోలింగ్ శాతం పెరగడానికి మహిళలు కూడా తమకు మద్దతుగా నిలిచారని తెలుస్తుంది.అమ్మ ఒడి, ఆసరా, ఇళ్ల పట్టాలు, చేయూత లాంటివి మహిళలకే అందించారని గుర్తు చేశారు. మహిళలకు ఆర్థిక స్వావలంబన చేకూర్చడం కోసం కృషిచేశారని సీఎం జగన్ ను కొనియాడారు. ఏదేమైనా జూన్ 4వ తేదీన మరలా వైసిపి ప్రభుత్వం అధికారం చేయబడుతుందని మాతో ఉన్నారు.ఈ ఎన్నికల్లో రాష్ట్రవ్యాప్తంగా ఓటర్లలో చైతన్యం కనిపించిందని అంబటి అన్నారు.