కూటమి గెలిస్తే ఆ పదవి కావాలని కోరుకుంటున్న పవన్.. కోరిక నెరవేరుతుందా?

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే ప్రశ్నకు సంబంధించి ఒకింత కన్ఫ్యూజన్ కొనసాగుతోంది. ఒకవైపు వైసీపీ నేతలు మరోవైపు కూటమి నేతలు గెలుపు విషయంలో కాన్ఫిడెన్స్ తో ఉన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలలో వైసీపీకి అనుకూల పరిస్థితులు ఉండగా మిగతా జిల్లాలలో కూటమికి అనుకూల పరిస్థితులు ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. వైసీపీ, కూటమి మేనిఫెస్టోలలో ఎవరి మేనిఫెస్టోను ఓటర్లు నమ్మారనే విషయంలో క్లారిటీ లేదు.
 
అయితే కూటమి గెలిస్తే తనకు ఇరిగేషన్ శాఖ కావాలని పవన్ కళ్యాణ్ కోరుకుంటున్నారని భోగట్టా. కారణాలు తెలీదు కానీ ఇరిగేషన్ శాఖా మంత్రి పదవి కావాలని ఆయన కోరుకుంటున్నట్టు పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి గెలిచిన తర్వాత పవన్ తన కోరికలను బయటపెడితే బాగుంటుందని కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు.
 
జనసేన 21 స్థానాల్లో పోటీ చేస్తుండగా 18 స్థానాల్లో జనసేన విజయం సాధిస్తుందని 3 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుందని ఆ పార్టీ అనుకూల పత్రికలు ప్రచారం చేసుకుంటున్నాయి. తాజాగా పవన్ కళ్యాణ్ సాగునీటి కాలువల నిర్వహణ పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలంటూ ప్రకటన చేసిన నేపథ్యంలో పవన్ కు ఆ శాఖపై ఆసక్తి ఉందని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
అయితే పవన్ కళ్యాణ్ అధికారికంగా ప్రకటిస్తే మాత్రమే ఈ వార్తలను నమ్మాల్సి ఉంటుంది. పవన్ ఆ శాఖపై ఫోకస్ పెట్టడం వెనుక వేర్వేరు కారణాలు ఉన్నాయని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ నిజంగా ఆ శాఖలను ఎంచుకుంటే అప్పుడు ఆ వార్తల్లో నిజానిజాలకు సంబంధించి, ఎంచుకోవడానికి గల కారణాలకు సంబంధించి పూర్తిస్థాయిలో వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. పవన్ కళ్యాణ్ ప్రస్తుతానికి రెస్ట్ మోడ్ లో ఉన్నారు. పెరిగిన పోలింగ్ ఏ పార్టీకి మేలు చేస్తుందో ఏ పార్టీకి నెగిటివ్ చేస్తుందో చూడాల్సి ఉంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: