పవన్ లేకుంటే టీడీపీ పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే?
ఇంకా కామ్రేడ్స్ బయట ఉన్న బాబు క్షేమం కోరుకునేవారుగా చేసుకుంది. అలాగే ఎన్నారైలను దగ్గరకు తీసుకుంది. వ్యతిరేక ఓట్లు అనేవి అసలు పోకుండా చూసుకుంది. ఇంత చేసినా కూడా వైసీపీతో హోరా హోరీ పోరు అన్నది.. పోలింగ్ తరువాత ఇండియా హెరాల్డ్ సర్వేలో తేలింది. ఈ రోజుకీ కూడా పవన్ టీడీపీ, బీజేపీతో కలిసి కూటమిగా ఏర్పడి గట్టి పోటీ ఇచ్చినా కూడా ఇంకా వైసీపీకి గెలిచే చాన్స్ ఉంది అనే బలమైన సర్వేలూ వస్తున్నాయి.టీడీపీ ఒంటరి పోరాటం చేసి ఉంటే కనుక ఈసారి ఎన్నికల్లో పరిస్థితి చాలా దారుణంగా ఉండేది. పవన్ లేకపోతే టీడీపీ పరిస్థితి అస్సాం అయ్యుండేది. అసలు పవన్ కళ్యాణ్ మద్దతు లేకుండా ఉంటే టీడీపీకి 20 సీట్లు కూడా వచ్చి ఉండేవి కావు అనేది ముమ్మాటికీ వాస్తవం.టీడీపీ పాలనలో మంచిగా చెప్పుకునేందుకు అసలు ఏది లేదు. జగన్ ఎన్నికల సభలలో ప్రశ్నించినట్లుగా తన పద్నాలుగేళ్ళ పాలనలో చంద్రబాబు నాయుడు చేసిన ఒక్క మైలు రాయి లాంటి పని ఏమైనా ఉందా అంటే లేదు అనే తెలుస్తుంది. ఈ నేపధ్యంలో పవన్ కళ్యాణ్ రూపంలో గట్టి అండ టీడీపీకి దొరికింది అనడంలో ఎలాంటి సందేహం లేదు.