ఏపీ:జగన్ పై.. ఎల్లో మీడియా మరో కుట్ర.. తిప్పి కొడుతున్న ప్రజలు..!

Divya
గత కొన్ని నెలల నుంచి జగన్ చేస్తున్న మంచి పనుల పైన ఎల్లో మీడియా, పేపర్ .. తప్పుగానే చూపిస్తూ ఉంటారు. ఇప్పుడు తాజాగా జగన్ మోసం బయటపడింది అంటూ ఒక ప్రకటన తెలియజేశారు..ప్రతి ఏడాది విద్యార్థుల సంఖ్య ప్రభుత్వ పాఠశాలలో తగ్గిపోతోందని స్కూల్స్ అన్ని నాశనం అయిపోతున్నాయని ఈనాడు పేపర్లో ఒక కథనం ప్రచురించబడింది. అందులో 2018, 19లో 39 లక్షల 29,019 మంది చదువుకోగా..2019-20 నాటికి 32 లక్షల 18,220 మందికి వెళ్లిపోయింది.. అంటూ తెలియజేశారు.2020-21 లో 43లక్షల 42,874 కి పెరిగిందంటూ తెలియజేశారు.2021-2022 లో 44 లక్షల 29,520 చేరారు.

దీన్ని గమనిస్తే అసలు ఇది పెరిగినట్టే అని చెప్పవచ్చు. కానీ ఎల్లో మీడియాకు మాత్రం ఇది తగ్గినట్టుగా ప్రచురించారు.2022-23 లో 39 లక్షల 95,999 మంది ఉన్నారు..2023-24 లో 35 లక్షల 62,550 మందికి తగ్గిపోయారని.. ఇది ప్రభుత్వ పతనం కాదా అంటూ రాసుకుంది. ఇక్కడ అసలు సమస్య ఏమిటంటే.. నిజాన్ని తెలిసి దాచి వేయడం అనేది. ప్రభుత్వ, ఎయిడెడ్ .. పుట్టి ప్రభుత్వ పాఠశాల లెక్క.. వెయ్యాలి. ఇది ప్రభుత్వ ఎయిడెడ్ ..ఎయిడెడ్ అనేది గతంలో ప్రభుత్వంలో ఒక భాగము. కొంతమంది ఎయిడెడ్ వద్దని కొంతమంది స్కూల్ లను మార్చేసుకున్నారు.

ప్రభుత్వ పాఠశాలను ప్రభుత్వ పాఠశాలలు గానే ఉన్నాయి.. కొన్ని ఎయిడెడ్ స్కూల్లో ప్రభుత్వంలో కలిపేసుకున్నారు. 3 వంతుల మంది ఎయిడెడ్ స్కూల్లను ప్రైవేటు స్కూళ్ల కింద మార్చుకున్నారు. ఇది అసలు వాస్తవం. దీంతో అసలు ఒరిజినల్ గా ప్రభుత్వ పాఠశాల లెక్క ఎంతనేది కాకుండా..ఎయిడెడ్ స్కూల్స్ తగ్గడంతో  టోటల్గా ప్రభుత్వ పాఠశాలల సంఖ్య తగ్గిందా అనే విషయాన్ని కూడా గుర్తించాలి.. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలు ప్రస్తుతం ఉన్న తీరు ఎలా ఉందో ప్రపంచమంతా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ వైపే చూస్తోంది. కానీ వీళ్ళకు మాత్రం అవన్నీ కనిపించవనీ మరొకసారి నిరూపించుకున్నారు. అయితే ఈ విషయం విన్న ప్రజలు సైతం ప్రస్తుతం ఉన్న స్కూల్లో గతంలో ఏ ముఖ్యమంత్రి కూడా చేయలేదని విధంగా తెలియజేస్తున్నారు.. అభివృద్ధి అనేది కొంతమందికి కనిపించదు అంటూ కూడా కామెంట్స్ చేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: