తెలంగాణ: బీఆర్ఎస్ చేసిన పెద్ద తప్పు.. సరిదిద్దుకోలేక తల పట్టుకుంటున్న కాంగ్రెస్..??

Suma Kallamadi
బీఆర్ఎస్ పార్టీ పదేళ్లపాటు తెలంగాణలో పరిపాలనలో ఉంది ఈ సమయంలో కేసీఆర్, కేసీఆర్ కుమారుడు కేటీఆర్ తో పాటు చాలా మంత్రులు చేసిన అక్రమాలను కాంగ్రెస్ ప్రభుత్వం బయటపెట్టే ప్రయత్నం చేస్తోంది. అలాగే రాష్ట్రానికి సంబంధించి బీఆర్ఎస్ తీసుకున్న నిర్ణయాలు ఇప్పుడు పరిపాలనలకు అడ్డంకిగా మారాయి. ముఖ్యంగా జిల్లాల ఏర్పాటులో బీఆర్ఎస్ సరైన సూత్రాలు ఫాలో కాలేదు. ఇష్టారాజ్యంగా జిల్లాల సంఖ్య పెంచేశారు కానీ పాలనకు అనుగుణంగా జిల్లాలను ఏర్పాటు చేయలేదు.
అధికారులు సరైన రీతిలో పనిచేయకపోవడం వల్ల కాంగ్రెస్ పరిపాలనను సరైన ట్రాక్ పై ఉంచలేకపోతోంది. పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడి లాగానే తయారయ్యాయి. బీఆర్ఎస్ చేసిన తప్పులను కాంగ్రెస్ సరిదిద్దలేకపోతోంది. పార్లమెంట్ నియోజకవర్గాల కోణంలో చూసుకుంటే 17 జిల్లాలు ఉంటే సరిపోతుంది, జనాభా పరంగా చూసుకున్న టీఎస్‌లో 22 జిల్లాలు ఉంటే చాలు. కానీ బీఆర్ఎస్ సర్కార్ ఏకంగా  33 జిల్లాలు ఏర్పాటు చేసి కాంగ్రెస్‌ను పెద్ద ఇరకాటంలో పడేసింది. ఎక్కువ జిల్లాలో ఉండటం వల్ల కొన్ని జిల్లాల్లో అధికారులు కొరత ఏర్పడింది. అధికారులు లేకపోతే పనులు పూర్తి కావడం లేదు. భవిష్యత్ లో ఈ కష్టాలు మరింత తీవ్రతరం అయ్యే అవకాశం ఉంది.
అలాంటి పరిస్థితులు తలెత్తకుండా జిల్లాల సంఖ్య తగ్గించాలని కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే మళ్లీ జిల్లాలను బీఆర్ఎస్ లేనిపోని ఉద్యమాలు ప్రారంభిస్తుందేమో అని కాంగ్రెస్ నాయకులు భయపడుతున్నారు. జిల్లాలు రద్దు చేస్తే వ్యతిరేకత ప్రతిఘటన ఎదురవుతుందని కాంగ్రెస్ వెనక్కి తగ్గుతోంది.
కొత్త జిల్లాల ఏర్పాటుతో కొన్ని నష్టాలు ఉన్నాయి కొన్ని ప్రయోజనాలు ఉన్నాయి. ఉదాహరణకు రియల్ ఎస్టేట్ రంగం బాగా ప్రయోజనాలు పొందింది. ప్రస్తుతం జిల్లాల సంఖ్య కుదిస్తే అదే వెనకంజ వేస్తుంది.
బీఆర్ఎస్ ఉద్యమాలు, రియల్ ఎస్టేట్ రంగంలో నష్టాలు ఎదురవుతే పార్టీ దెబ్బయి పోవడం ఖాయం. న్యాయపరమైన చిక్కుల్లో కూడా కాంగ్రెస్ ప్రభుత్వం పడే అవకాశం ఉంది. బీఆర్ఎస్ ఇప్పటికే ప్రజలను ఆకర్షించే పనిలో ఉంది. కాంగ్రెస్ ఏ పొరపాటు చేసినా దాన్ని ప్రస్తావిస్తూ కాంగ్రెస్ ను వడగొట్టే అవకాశం ఉంది. పథకాలను పూర్తిస్థాయిలో అమలు చేయడం లేదని ప్రజలు తీవ్ర అసంతృప్తిలో ఉన్నారు. కాబట్టి కొత్త నిర్ణయాలు తీసుకునే ముందు ఆచూకీ వ్యవహరించాలని కాంగ్రెస్ నేతలు అనుకుంటున్నారు సమాచారం.

మరింత సమాచారం తెలుసుకోండి:

BRS

సంబంధిత వార్తలు: