ఏపీ సీఎంను నిర్ణయించే వ్యక్తి అతనేనా.. ఆ వ్యక్తికి మాత్రమే ఆ అర్హత ఉందా?
ఏపీ ఎన్నికల ఫలితాలు తారుమారుగా ఉంటాయని ఫలితాలు వెలువడిన తర్వాత సీఎం ఎవరు అవుతారో మోదీ నిర్ణయిస్తారని సీపీఐ నారాయణ తెలిపారు. ఆయన ఆలోచనల ప్రకారం కూటమి గెలిచే ఛాన్స్ ఉందని మూడు పార్టీల పొత్తు నేపథ్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు అవుతారని ఆయన అంచనా వేసి ఉండవచ్చని నెటిజన్ల నుంచి కామెంట్లు వినిపిస్తున్నాయి. ఏపీలో ఒక్క సీటు లేకపోయినా గత ఐదేళ్లుగా బీజేపీనే అధికారం చలాయిస్తోందని భవిష్యత్తులో కూడా అదే జరగనుందని ఆయన చెబుతున్నారు.
అయితే సీపీఐ నారాయణ చెప్పినట్టు మోదీ చేస్తారా? అంటూ కొంతమంది నెటిజన్లు సోషల్ మీడియా వేదికగా రియాక్ట్ అవుతున్నారు. ఎవరు సీఎం కావాలో ఎవరు సీఎం కాకూడదో మోదీ చేతుల్లో ఏం ఉండదని నెటిజన్లు సైతం చెబుతున్నారు. మోదీ టెన్షన్లు మోదీకి ఉన్నాయని ఆయనకు ఏపీ రాజకీయాలపై దృష్టి పెట్టే టైమ్ కూడా లేదని నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.
ఎన్నికల ఫలితాలు వెలువడే వరకు సీపీఐ నారాయణ ఇలాంటి కామెంట్లు చేయవద్దని మరి కొందరు నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఏపీలో ఎన్నికల ఫలితాలకు సరిగ్గా 10 రోజుల సమయం మాత్రమే ఉంది. ఎన్నికల ఫలితాల నేపథ్యంలో టీడీపీ, వైసీపీ నేతలకు ఇప్పటికే టెన్షన్ పట్టుకుంది. ఏపీలో ఏ నియోజకవర్గంలో ఎలాంటి ఫలితాలు వస్తాయనే చర్చ కూడా జరుగుతోంది. చాలామంది నేతలు తమకే అనుకూలంగా ఫలితాలు రావాలని పూజలు చేస్తున్నట్టు తెలుస్తోంది.