సేఫ్ జోన్ లో పవన్...కూటమి ఓడినా ఆ పదవి గ్యారంటీ ?

Veldandi Saikiran
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఇప్పుడు అందరి చూపు ఫలితాల పైన ఉంది. పోలింగ్ పూర్తయి బ్యాలెట్ బాక్స్ లన్ని భద్రత సిబ్బంది ఆధ్వర్యంలో ఉన్నాయి. పకడ్బందీగా బ్యాలెట్ వద్ద కాపలా కాస్తున్నారు ఉన్నతాధికారులు. ఇటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏ పార్టీ గెలుస్తుంది అనే దానిపై జోరుగా బెట్టింగులు కూడా సాగుతున్నాయి. ఇలాంటి నేపథ్యంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పరిస్థితి ఏంటని అందరూ చర్చించుకుంటున్నారు. 


ఈసారి పిఠాపురం నియోజకవర్గంలో పవన్ కళ్యాణ్ గెలుస్తారా లేదా అని అందరూ మాట్లాడుకుంటున్నారు. ఏపీలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందనే దానికంటే ముందు పవన్ కళ్యాణ్ ని గెలుపు పైన బెట్టింగులు కూడా సాగుతున్నాయట. 2019 ఎన్నికల్లో రెండు చోట్ల దారుణంగా ఓడిపోయారు పవన్ కళ్యాణ్. భీమవరం అలాగే గాజువాక నియోజకవర్గంలలో  పవర్ స్టార్ పవన్ కళ్యాణ్... వైసిపి చేతిలో ఓడిపోయారు. అందుకే ఈసారి ఎలాగైనా గెలవాలని పిఠాపురం నియోజకవర్గాన్ని ఎంచుకున్నారు.

పిఠాపురం నియోజకవర్గంలో కాపు ఓట్లు విపరీతంగా ఉంటాయి. ఆ ఓట్లే పిఠాపురం నియోజకవర్గ గెలుపును శాసిస్తాయి. దీంతో పిఠాపురం బరిలో నిలిచారు పవన్ కళ్యాణ్. ఇక తాజా సర్వేల ప్రకారం పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గెలుస్తాడని తెలుస్తోంది. అయితే ఇలాంటి తరుణంలో జనసేన అధినేత పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు భారతీయ జనతా పార్టీ అదిరిపోయే ఆఫర్ ఇచ్చిందట. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏపీలో కూటమి అధికారంలోకి వస్తే.. పవన్ కళ్యాణ్ కు ఉపముఖ్యమంత్రి పదవి గ్యారెంటీ అంటున్నారు.
బిజెపి కూడా ఇప్పటికే ఈ నిర్ణయం పై క్లారిటీ కూడా ఇచ్చేసిందట. అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూటమి అధికారంలోకి రాకపోతే... మరో ఆఫర్ కూడా ఉందట పవన్ కళ్యాణ్ కు..! ఎలాగైనా ఇండియాలో బిజెపి ప్రభుత్వం రావడం ఖాయం. ఇక అక్కడ ఓ కీలక పదవి పవన్ కళ్యాణ్ కు కట్టబట్టేందుకు నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకున్నారట. కేంద్ర సహాయక మంత్రిగా పవన్ కళ్యాణ్ కు బాధ్యతలు ఇచ్చే ఛాన్స్ ఉందని నేషనల్ మీడియాలో కూడా కథనాలు వస్తున్నాయి. దీంతో తెలుగుదేశం కూటమి ఓడిన... లేదా గెలిచిన.... పవన్ కళ్యాణ్ కు మాత్రం ఒక పదవి గ్యారంటీ అని చర్చ జరుగుతోంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: