జగన్: ఫలితాలు రాకముందే ఢిల్లీ నుంచి బంపర్ ఆఫర్..!
ఐదే గత ఎన్నికలలో బిజెపికి దగ్గరైన జగన్.. ఎన్డీఏ పార్టీలోకి మాత్రం చేరలేదు ఎన్నికల ముందు చంద్రబాబు ఎన్డీఏ నుంచి బయటికి వచ్చి ఆ తర్వాత ఓడిపోయారు. రాజ్యసభలో బిజెపి పార్టీకి ఆశించిన స్థాయిలో బలం లేకపోవడంతో ఎన్నోసార్లు జగన్ పార్టీ అన్ని విధాల సహకరించింది. కానీ ఈసారి ఎన్నికల సమయానికి బిజెపి, టిడిపి, జనసేన పార్టీలు కూటమిగా ఏర్పడ్డాయి. కేవలం ఒక్క జగన్ ను ఓడించడానికి ఇలా అందరూ ఏకమయ్యారు. అయినా కూడా గెలుస్తామని నమ్మకం కూటమిలో కనిపించలేదు.
ఇలా రకరకాల చర్చలు నడుస్తున్న సమయాల్లో ఒకవేళ రాష్ట్రంలో వైసిపి పార్టీ అధికారంలోకి వచ్చి మెజారిటీ పార్లమెంటు స్థానాలను దక్కించుకుంటే ఖచ్చితంగా జగన్ కీలకంగా మారుతారని విషయం ఇప్పుడు వినిపిస్తోంది. అంతేకాకుండా కేంద్రంలో బిజెపికి అవసరమైన మెజారిటీ కూడా దక్కకపోవచ్చు అనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి.. ఇలాంటి సమయంలోనే అటు కాంగ్రెస్ ,బిజెపి నుంచి వైసీపీ పార్టీకి ఆఫర్లు వెలుబడుతున్నాయట.. కానీ జగన్ ఎవరు పక్షాన నిలబడతారు అన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. అయితే ఏపీ ప్రజల బాగు కోసమే జగన్ కచ్చితంగా ఎవరైతే ప్రత్యేక హోదాను ఇచ్చి అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్ ని ప్రైవేటీకరణం చేయకుండా ఆపుతారో అలాగే అన్ని విధాలుగా ఆంధ్రప్రదేశ్ కి సహకరిస్తామని ప్రకటన చేసిన తర్వాతే ఆలోచిస్తామని కూడా తెలియజేసినట్లు సమాచారం. మరి ఇందులో ఎంత నిజం ఉందో తెలియదు కానీ.. ఏపీ రాజకీయాలు జాతీయ రాజకీయాలని మలుపు తిప్పేలా కనిపిస్తున్నాయి.