జగన్ ను ఓడించి పవన్ కళ్యాణ్ సీఎం అవడం పక్కా.. వేణు స్వామి సంచలన వ్యాఖ్యలు..!
పవన్ కళ్యాణ్ జాతకంలో సీఎం అయ్యే యోగం లేదని.. రాజకీయాల్లో మోసపోతారని వేణు స్వామి తెలియజేశారు. ఈ జోస్యంతో పవన్ అభిమానులకి చిర్రొత్తుకొచ్చేలాగా చేశాడు వేణు స్వామి. అయినా సక్సెస్ రేట్ 98% చెప్పుకుంటారని.. కానీ స్వామి చెప్పిన విషయాలు అన్నీ జరుగుతాయ అనడానికి ఎటువంటి ఆధారాలు లేవంటూ మండిపడుతున్నారు. ఇక తాజాగా ఈ ట్రోలింగ్ దెబ్బకు బుద్దు తెచ్చుకున్న వేణు స్వామి మాట మార్చాడు. పవన్ కళ్యాణ్ సీఎం అవ్వాలని కోరిక తనకు కూడా ఉందని.. పవన్ అంటే విపరీతమైన పిచ్చి అని తెలియజేశారు.
జగన్మోహన్ రెడ్డిని ఓడించి రేపు పవన్ కళ్యాణ్ సీఎం కావాలని కోరుకుంటున్నట్లు వేలు స్వామి వెల్లడించారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతుంది. ఈయన కామెంట్స్ ని చూసిన పలువురు... చదవకముందు కాకరకాయ చదివిన తర్వాత కేకరగాయి అన్నట్టుగా మాట భలే మార్చేశావు వేణు స్వామి? మొన్నటి వరకు పవన్ కళ్యాణ్ ని హేళన చేసే మాట్లాడిన నువ్వు ఇప్పుడు పెద్ద పత్తితి లాగా మాట్లాడుతున్నావు? నీ జాతకాలని నమ్మినవాడు నిలువునా మునిగిపోతాడు.. నిజమైన జ్యోతిష్కం చెప్పేవాడు ఎవరూ మీలాగా ఎగస్ట్రాలు చేయరు? అంటూ కామెంట్స్ చేస్తున్నారు.