"పని" పాలకుడు జవహర్ రెడ్డిపై అభాండాలా.?

Pandrala Sravanthi
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎన్నికల ముగిసాయి. జూన్ 4వ తేదీన ఫలితాలు బయటకు రానున్నాయి.  ఇదే క్రమంలో సిఎస్ జవహర్ రెడ్డి పై లేనిపోని అవినీతి ఆరోపణలు చేస్తూ టిడిపి భజన చేస్తోంది. సిఎస్ జవహర్ రెడ్డి అంటే పని పాలకుడు. ఆయన పేద ప్రజల అభివృద్ధి కోసం ఎంతో పాటు పడతారు. జవహర్ రెడ్డి కేవలం తన జాబ్ ను మాత్రమే నమ్ముతారు.  రాజకీయాలకతీతంగా ఉద్యోగం చేసే అధికారులలో జవహర్ రెడ్డి కూడా ఒకరని చెప్పవచ్చు. అలాంటి జవహర్ రెడ్డిపై  టిడిపి భజన బ్యాచ్ అంతా  అవినీతి చేశారని ల్యాండ్ స్కాములు చేశారని  ఆరోపణలు చేస్తూ  ఆయన పరువుకు భంగం కలిగే ప్రయత్నాలు చేస్తోంది. జవహర్ రెడ్డి ఇంకా  నెల రోజుల్లో పదవి విరమణ తీసుకోనున్నారు. ఈ తరుణంలో ఆయనను ఇలా ఇరికించడం  సమంజసం కాదని అంటున్నారు. 

 1990 బ్యాచ్ ఐఏఎస్ అధికారి అయిన జవహర్ రెడ్డి  ఎన్నో పదవి బాధ్యతలు చేపట్టారు. వివిధ జిల్లాల కలెక్టర్ గా చేశారు. ప్రతి ప్రాంతంలో ఉండేటువంటి కష్టాలు, నష్టాలు, కరువు కాటకాలను చూశారు.  అలా ఎంతో సీనియర్ అయినటువంటి ఈ అధికారిని జగన్ ఏరి కోరి మరి సిఎస్ గా నియమించారు. అంతేకాకుండా ఆయనకు టీటీడీ ఈవోగా కూడా సేవలు అందించారు. ఎప్పుడైతే జవహార్ రెడ్డి  సీఎం జగన్ మోహన్ రెడ్డికి స్పెషల్ సెక్రటరీ అయ్యారో ఇక అప్పటినుంచి పసుపు బ్యాచ్ కి పడడం లేదు. ఆయన ప్రతి విషయంలో చాలా నిబద్ధతతో  రూల్స్ రెగ్యులేషన్స్ పాటిస్తూ ఉంటారు. ఆయన పనితనం చూసినటువంటి  చంద్రబాబు నాయుడు ఎలాగైనా ఇరికించాలనే ప్లాన్ చేసి అసైన్డ్ భూములు స్కామ్ చేశారని,  కొడుకు పెద్ద పెద్ద వ్యాపారాలు చేస్తున్నారనే విషయాన్ని ప్రస్తావిస్తూ వస్తున్నారు.

కానీ జవహర్ రెడ్డి మాత్రం అలాంటి వివాదాలకు ఆమడ  దూరంలో ఉంటారు. ఆయన ఇన్నేళ్ల సర్వీసులో ఏనాడు లేని మచ్చ  రిటైర్డ్ అయ్యే ముందు  తీసుకొచ్చారంటే ఈ పాపం ఎవరిది అనేది ప్రతి ఒక్కరికి అర్థం అవుతుంది. జవహర్ రెడ్డి సిఎస్ గా అపాయింట్ అయిన తర్వాత  ఆంధ్రప్రదేశ్ తెలంగాణ మధ్య ఉన్నటువంటి కొన్ని ఒప్పందాలు, విద్యుత్ బకాయిలు, పోలవరం ప్రాజెక్టు, ఇలా రాష్ట్రానికి సంబంధించిన ఎన్నో అభివృద్ధి పనులకు సంబంధించి ఆయన చాలా శ్రద్ధగా వర్క్ చేశారు. ఈ విధంగా మచ్చ లేకుండా పనిచేసినటువంటి జవహర్ రెడ్డి మీద  లేనిపోని ఆరోపణలు చేస్తూ  పబ్బం గడుపుతున్నారని, రాజకీయ అవసరాల కోసం నిబద్ధత కలిగిన  అధికారులను ఇరికించడం సమంజసం కాదని  సీనియర్ విశ్లేషకులు అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: