ఏపీ: అక్కడ కూటమి విజృంభణ... వైసీపీకి చుక్కలే?
అలా చూసుకుంటే, ఈ లిస్టులో డెబ్బై వరకు సీట్లను కూటమి చేజిక్కించుకుంటే అధికారం ఇక వారిదే అని చెబుతున్నాయి సర్వేలు. అలాగని జరిగితే ఆ స్పీడ్ ని ఆపడం ఇక వైసీపీ వల్ల కాదు అని గుసగుసలు వినబడుతున్నాయి. 2014లో టీడీపీ కూటమికి ఇక్కడే దాదాపుగా 88 సీట్లు దక్కాయి. దాంతో అవలీలగా టీడీపీ గెలిచింది. ఈసారి కూడా అదే మ్యాజిక్ జరుగుతుందని కూటమి నమ్మకం. ఉత్తరాంధ్రాలో తక్కువలో తక్కువగా 20, గోదావరి జిల్లాలలో కనీసం 25 సీట్లు. అలాగే క్రిష్ణా గుంటూరులలో 25 గెలుస్తామని టీడీపీ కూటమి ధీమా వ్యక్తం చేస్తున్నట్టు కనబడుతోంది.
ఈ లెక్క ప్రకారం చూస్తే... వైసీపీకి 31 సీట్లు మాత్రమే వస్తాయనేది తేటతెల్లం అవుతోంది. ఇక కోస్తాలో డెబ్బై సీట్లు గెలిస్తే టీడీపీ కూటమికి మ్యాజిక్ ఫిగర్ ని టచ్ చేయడానికి కేవలం 18 అంటే 18 సీట్లు మాత్రమే తగ్గుతాయి. ఇక గ్రేటర్ రాయలసీమలోని 6 జిల్లాలలో ఉన్న 74 సీట్లలో కనీసంగా 25 సీట్లు గెలిచి తీరుతామని కూటమి తొడగొట్టి మరీ చెబుతోంది . దాంతో టీడీపీ అంచనాలు ఫలించి అదే జరిగితే రాయలసీమలోని సీట్లు తగ్గి, నెల్లూరు ప్రకాశంలో తక్కువ నంబర్ గెలిస్తే వైసీపీ అధికారానికి దూరం అవుతుందని విశ్లేషకులు అంటున్నారు. ఎందుకంటే 2014లో కూడా ఇదే రకమైన అనుభవాలు వైసీపీకి ఎదురయ్యాయి.