దేశంలోనే ఏ రాష్ట్రంలో అయినా ముఖ్యమంత్రి పదవి కాలం ఐదు సంవత్సరాలు అన్న విషయం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఏ ముఖ్యమంత్రి అయిన అతని పూర్తి పదవీ కాలం ముగిసే వరకు ఉన్నట్లు అయితే ఆయన ఐదు సంవత్సరాల పాటు అధికారంలో ఉంటారు. ఇక కొంతమంది కొన్ని పరిస్థితుల వల్ల ముందే తమ పదవికి రాజీనామా చేయడం , లేకపోతే ముందే రాజీనామాలు ప్రకటించి ఎలక్షన్ లకి రావడం ఇలా అనేక కారణాల వల్ల ఐదు సంవత్సరాలు కూడా అధికారంలో లేని ముఖ్యమంత్రులు ఎంతో మంది ఉన్నారు.
ఇకపోతే ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు ముఖ్యమంత్రిగా ఉండు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తాజాగా ఓ రికార్డ్ ను సృష్టించారు. అసలు జగన్మోహన్ రెడ్డి 5 సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు ఎందుకు ముఖ్యమంత్రి గా కొనసాగుతున్నారు. ఆయన ఎన్ని రోజులు ఐదు సంవత్సరాల కంటే ఎక్కువ రోజులు అధికారంలో ముఖ్యమంత్రి గా ఉండబోతున్నారు అనే విషయాలను తెలుసుకుందాం.
2014 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో చంద్రబాబు అధ్యక్షతన తెలుగు దేశం పార్టీ అధికారం లోకి వచ్చింది. ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో జగన్మోహన్ రెడ్డి అధ్యక్షతన వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చింది. ఇక పోయిన సారి కంటే ఈ సారి ఎన్నికలు కాస్త ఆలస్యంగా జరగడం , పోయినసారి రిజల్ట్ త్వరగా రావడంతో చంద్రబాబు నాయుడు త్వరగా రాజీనామా చేశారు.
దానితో ఈ రోజుతోనే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి గా ప్రమాణ స్వీకారం చేసి ఐదు సంవత్సరాలు అవుతుంది. ఇకపోతే జూన్ 4 వ తేదీన మే 13 వ తేదీన జరిగిన ఎన్నికలకు సంబంధించిన రిజల్ట్ రాబోతుంది. ఆ తేదీ వరకు చూసినట్లు అయితే జగన్ మరో ఐదు రోజులు ఆదనంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా కొనసాగనున్నారు. ఇలా జగన్ ఐదు రోజులు ఎక్స్ట్రా సీఎంగా పని చేసి తాజాగా రికార్డు ను సృష్టించారు.