వైసీపీ విక్టరీ: పెద్దిరెడ్డి దెబ్బకు రామచంద్ర యాదవ్ అబ్బ.. ఆయనతో పెట్టుకుంటే మసే??

Suma Kallamadi
మాజీ సీఎం చంద్రబాబు నాయుడు, ప్రస్తుత మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఇద్దరిదీ ఉమ్మడి చిత్తూరు జిల్లానే కావడం విశేషం. ఈ నేతలకు కాలేజీ డేస్ నుంచి అంటే 50 ఏళ్లుగా పెద్ద వైరం నడుస్తోంది. అయితే ప్రతిసారి చంద్రబాబుపై పెద్దిరెడ్డి పై చేయి సాధిస్తూనే వస్తున్నారు. ఏపీలో ఒక కింగ్ గా ఆయన రాణిస్తున్నారు. ఇక పుంగనూరులో ఆయనకు సాటి వచ్చే నేత లేరంటే అతిశయోక్తి కాదు. చంద్రబాబు నాయుడు ఈసారి వ్యూహాత్మకంగా భారత చైతన్య యువజన పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్ ను బరిలోకి దింపారు. పుంగనూరు నియోజకవర్గంలో అతనితో ఎన్నో గొడవలు చేయించారు. పెద్దిరెడ్డి ఒక పెద్ద గుండా అని ప్రొజెక్ట్ చేసి ప్రజలను ఆయన నుంచి దూరం చేయడానికి ఎన్నో కుట్రలు పన్నారు.
బోడె రామచంద్ర యాదవ్ ప్రజలను ప్రలోభాలకు గురి చేశారు. చీరలు, గడియారాలు పంచి పెడుతూ తమ వైపు తిప్పుకునే ప్రయత్నం చేశారు. రైతులకు ఫ్రీగా ఆవులను కూడా ఇస్తామన్నారు. రక్తపాతం సృష్టించైనా పుంగనూరులో బీసీవై జెండాని ఎగరవేయాలని భావించారు. మే 13వ తేదీన పోలింగ్ స్టార్ట్ అయిన గంట తర్వాతనే టీడీపీ వాళ్లకు పెద్దిరెడ్డి కే ఓట్లు అన్ని పడిపోతున్నాయనే సంగతి బోధపడింది. అందుకే వాళ్ళు దాడులకు తెగబడ్డారని రాజకీయ విశ్లేషకులు పేర్కొన్నారు. ఓటింగ్ శాతాన్ని తగ్గించేందుకు పెద్ద అరాచకాలికే పాల్పడ్డారు. పరోక్షంగా బీసీవై అధినేతను నిలబెట్టడంతో పాటు టీడీపీ నుంచి చల్లా రామచంద్రారెడ్డిని చంద్రబాబు నిలబెట్టారు. అతడిని ఒక తోలుబొమ్మలాగా నిలబెట్టారే కానీ నిజమైన అభ్యర్థిగా నిలబెట్టలేదు. మొత్తం బీసీవై అధినేత నుంచే కథ నడిపించారు.
నిజం చెప్పాలంటే, పుంగనూరు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి కంచుకోట. స్ట్రాంగ్ క్యాడర్‌ పెద్దిరెడ్డికి పెద్ద ప్లస్ పాయింట్. అక్కడి వైసీపీ నేతలు చాలా యాక్టివ్ గా పార్టీ యాక్టివిటీస్ లో పాల్గొంటారు. ప్రజలకు అన్నివేళలా అన్ని విధాలా మద్దతుగా ఉంటారు.  అవినీతి ఆరోపణలు మైనస్‌గా అనిపించినా రాజకీయ విశ్లేషకుల ప్రకారం ఈసారి కూడా పుంగనూరు లో పెద్దిరెడ్డిదే గెలుపు. పుంగనూరులో ఎవరు నిలుచున్నా పెద్దిరెడ్డి ఉన్నంతవరకు ఓడిపోవడం ఖాయమని జూన్ 4వ తేదీన మరోసారి నిరూపితం కానుంది అని పొలిటికల్ అనలిస్టులు బోల్డ్‌గా చెప్పేస్తున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: