వైసీపీ విక్టరీ: కేతిరెడ్డి బరిలోకి దిగితే వార్ వన్ సైడే...??
ఒక్కటేంటి ప్రజలకు రోజూ అందుబాటులో ఉంటూ వారి సమస్యలను అడిగి మరీ సాల్వ్ చేసిన గొప్ప నేత కేతిరెడ్డి అని చెప్పుకోవచ్చు. ధర్మవరం నియోజకవర్గంలో 2,41,910 ఓట్లు ఉన్నాయి. ఇక్కడి గెలుపును పద్మశాలి ఓటర్లు బాగా ప్రభావితం చేస్తుంటారు. కేతిరెడ్డి 2019లో 15,666 ఓట్ల మెజారిటీతో టీడీపీ అభ్యర్థి గోనుగుంట్ల సత్యనారాయణపై విజయం సాధించారు. అయితే 2024లో కేతిరెడ్డిని ఓడించడానికి కూటమి బీజేపీ నేత సత్యకుమార్ రంగంలోకి దింపింది. భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడుకు వ్యక్తిగత కార్యదర్శిగా సత్య కుమార్ పనిచేశారు. బీజేపీలో మంచి పేరు తెచ్చుకున్నారు. బీజేపీ కేంద్ర నాయకులతో ఈయనకు మంచి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి. ఈయన యాదవ సామాజిక వర్గానికి చెందినవారు. అందుకే బీసీ ఓటు బ్యాంకు తన వైపే ఉంటుందని ఆయన భావించారు. అంతేకాదు ఎన్నికల ప్రచార సమయంలో వాడ వాడ తిరుగుతూ గట్టిగానే కష్టపడ్డారు.
అయితే సత్య కుమార్ను ఎమ్మెల్యే అభ్యర్థిగా ప్రకటించినప్పుడే టీడీపీ డీలా పడిందట. ఎందుకంటే నిత్యం నియోజకవర్గమంతటా తిరుగుతూ అభివృద్ధి చేసిన కేతిరెడ్డిని ఢీకొనడం సత్యకుమార్ వల్ల కాదని వారు కూడా భావించారట. ఏది ఏమైనా ధర్మవరం ప్రజలు కేతిరెడ్డికి బాగా దగ్గరయ్యారు. దీన్నిబట్టి మరోసారి ఆయన ఎమ్మెల్యే కావడం పక్కా అని చాలామంది ధీమాగా చెబుతున్నారు. ఆయనకి కాకుండా వేరే వ్యక్తికి ఓటు వేస్తారా? అనేది జూన్ 4వ తేదీనే తేలుతుంది.