కూటమి తాకలేని వైసీపీ కంచుకోటలివే.. అభ్యర్థి ఎవరైనా జగన్ బొమ్మకే ఓటు!

frame కూటమి తాకలేని వైసీపీ కంచుకోటలివే.. అభ్యర్థి ఎవరైనా జగన్ బొమ్మకే ఓటు!

Reddy P Rajasekhar
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైసీపీ కంచుకోటలాంటి నియోజకవర్గాలు ఎక్కువ సంఖ్యలోనే ఉన్నాయి. ఈ నియోజకవర్గాల్లో చాలా నియోజకవర్గాలు వైసీపీకి కంచుకోటలా ఉన్నాయి. మరో విధంగా చెప్పాలంటే 2014లో వైసీపీ విజయం సాధించిన నియోజకవర్గాలు అన్నీ ఆ పార్టీకి కంచుకోటలు అని చెప్పవచ్చు. 2019 ఎన్నికల్లో సైతం 2014లో గెలిచిన మెజారిటీ నియోజకవర్గాల్లో వైసీపీనే విజయం సాధించింది.
 
సీమ జిల్లాల్లోని చాలా నియోజకవర్గాల్లో తమకు వైసీపీ అభ్యర్థి ఎవరనే అవసరం లేదని జగన్ పార్టీ తరపున పోటీ చేస్తున్నారు కాబట్టి జగన్ బొమ్మకే తమ ఓటు అని ఇక్కడి ఓటర్లు చెబుతున్నారు. ఉమ్మడి కర్నూలు జిల్లాలోని మంత్రాలయం, కోడుమూరు నియోజకవర్గాలు వైసీపీ కంచుకోటలు అని చెప్పవచ్చు. దెందులూరు, బీరుపాడు, చంద్రగిరి, చింతలపూడి, పుంగనూరు నియోజకవర్గాలు సైతం వైసీపీ కంచుకోటలుగా ఉన్నాయి.
 
ఈ నియోజకవర్గాల్లో మళ్లీ వైసీపీకే ప్రజలు పట్టం కట్టబోతున్నారని కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. వైసీపీ ఓడిపోవడం అసాధ్యమని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. జగన్ నిర్మించిన వాలంటీర్ల వ్యవస్థ, సచివాలయ వ్యవస్థ ఉద్యోగులు, వాళ్ల కుటుంబాలు, సంక్షేమ పథకాలను అందుకున్న ఓటర్లు జగన్ కు అండగా నిలుస్తారని నెటిజన్ల నుంచి కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం.
 
జగన్ తాను చేసిన మంచి తనను గెలిపిస్తుందని చాలా నియోజకవర్గాల ఫలితాల విషయంలో జగన్ కు పూర్తిస్థాయిలో స్పష్టత ఉందని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి. 2024 ఎన్నికల ఫలితాలకు సంబంధించి నెలకొన్న ఉత్కంఠ మాత్రం అంతాఇంతా కాదని పొలిటికల్ వర్గాల్లో వినిపిస్తోంది. ఎన్నో సర్వేల భవిష్యత్తును సైతం ఈ ఎన్నికల ఫలితాలు డిసైడ్ చేయనున్నాయని సోషల్ మీడియా వేదికగా కామెంట్లు వ్యక్తమవుతూ ఉండటం గమనార్హం. ఏపీలో ఫలితాలకు సంబంధించి చాలా నియోజకవర్గాల్లో బెట్టింగ్స్ కూడా జరుగుతున్నాయి. కూటమి వైపే ఎక్కువమంది బెట్టింగ్ కడుతున్నా ఫలితాలు మాత్రం భిన్నంగా ఉండబోతున్నాయని తెలుస్తోంది. వైసీపీ, కూటమి నేతలు ఫలితాల విషయంలో టెన్షన్ పడుతున్నారని కామెంట్లు వ్యక్తమవుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: