ఏపీ: జగన్ ఓడిపోతే.. ప్రజలు ఓడిపోయినట్లే..??
నాడు నేడు కార్యక్రమంతో గవర్నమెంట్ బళ్లను ప్రైవేటు స్కూళ్ల కంటే అద్భుతంగా తీర్చిదిద్దారు. పెద్దగా ఇంగ్లీష్ మాట్లాడలేని వారి చేత కార్పొరేట్ స్కూల్ పిల్లలకు పోటీగా మాట్లాడేటట్టు చేయగలిగారు. కొత్తగా 2 లక్షలకు పైగా ఉద్యోగాలను కూడా అందజేశారు. వాలంటీర్ వ్యవస్థతో ప్రజల జీవితాలను సుఖమయం చేశారు. మళ్లీ అవకాశం ఇస్తే ఐదేళ్లలో ఏపీని ఇంకా అభివృద్ధి చేస్తానని, ప్రజలకు అండగా, మద్దతుగా నిలుస్తానని కూడా హామీ ఇచ్చారు. చంద్రబాబు జగన్ కంటే ముందు ఒకటి కంటే ఎక్కువసార్లే సీఎం అయ్యారు కానీ ఆయన ఏ సమయంలోనూ పేదలకు, బడుగు, బలహీన వర్గాలకు ఆర్థిక సహాయం అందించిన దాఖలాలు లేవు.
ఎన్నో హామీలు ఇచ్చారు కానీ వాటిలో చాలా వరకు అమలు చేయలేదు. ఈసారి జగన్ కంటే ఎక్కువ హామీలను అందించారు. అవి ఆచరణ సాధ్యం కాని హామీలు. వాటిని అమలు చేస్తామని ప్రలోభ పెట్టారు వీటిని ప్రజలు నమ్మేరా? నమ్మలేదా? అనేది జూన్ 4వ తేదీనే తెలుస్తుంది. కానీ ఒకవేళ టీడీపీ గెలిస్తే అది ఒక మంచి నాయకుడిని అవమానించినట్లే అవుతుంది. ప్రజలే ఓడిపోయినట్లు భావించాల్సి వస్తుంది. మంచి పరిపాలన చేస్తున్న నాయకుడిని ఓడిస్తే ప్రజలు ఓడిపోవడం తప్ప ఇంకేం కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఎంత మంచి చేసినా సీఎం ఓడిపోయారని, ఎంత డబ్బులు ఇచ్చినా చివరికి హ్యాండ్ ఇస్తారని మిగతా సీఎం అభ్యర్థులు అర్థం చేసుకోవచ్చు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ను నమ్మి ఎంత మోసపోయారో ఇప్పుడిప్పుడే అర్థం చేసుకుంటున్నారు.
కరెంటు కటింగ్స్ తో సామాన్య ప్రజలతో పాటు రైతులు సైతం నానా అవస్థలు పడుతున్నారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలలో ఫ్రీ బస్సు, ఫ్రీ కరెంటు మాత్రమే అమలు చేసింది. తులం బంగారం, 2,500 ప్రతినెలా మహిళలకు అందజేస్తామని చెప్పిన హామీలను ఇంకా నెరవేర్చలేదు. చంద్రబాబు కూడా అధికారంలోకి వస్తే అలాగే ఒకట్రెండు హామీలను నెరవేర్చి కాలం గడిపే అవకాశం ఉంది. దీనివల్ల ఐదేళ్లు ఆంధ్ర ప్రజలు నానా కష్టాలు పడాల్సిందే. ఇదంతా ఆలోచించుకునే ప్రజలు ఓట్లు వేసి ఉంటారని పొలిటికల్ అనలిస్టులు భావిస్తున్నారు.