ఏపీ పాలిటిక్స్: ఆ పార్టీకి ఒక్క సీటు కూడా రాదు.. చింతా మోహన్ ఘాటు వ్యాఖ్యలు..!

lakhmi saranya
కాంగ్రెస్ నేత మరియు మాజీ ఎంపీ చింతా మోహన్ యాదృచ్ఛికంగా బిజెపి మీద విమర్శలు చేశారా?.. లేక నిజంగానే బిజెపి యొక్క సీటు గెలవలేదా అనే ఘటన తెరపైకి వచ్చింది. టిడిపి, జనసేనతో పొత్తులో భాగంగా బిజెపి మొత్తం ఆరు ఎంపీ, పది అసెంబ్లీ నియోజకవర్గాల్లో పోటీ చేసింది. వాస్తవంగా ఆ పార్టీ బలానికి.. పోటీ చేసిన సీట్లకు పొంతన లేనేలేదు. టిడిపి మరియు జనసేన ఓట్లు ఏ మేరకు బిజెపి అభ్యర్థులకు బదిలీ అయ్యాయనే అంచనా మేరకు చింతా మోహన్ అలా వ్యాఖ్యానించి ఉండొచ్చని రాజకీయ పరిశీలకులు చెబుతున్నారు.
ఎన్నికలకు ముందు ప్రధాని మోడీ, అమిత్ షా తో సీఎం జగన్మోహన్ రెడ్డి భేటీ అనంతరమే రాష్ట్రంలో బిజెపి పొత్తును కుదురుచుకుంది. వాళ్ల మధ్య జరిగిన చర్చను బట్టే బిజెపి ఎక్కువ స్థానాలను  డిమాండ్ చేసినట్లు నాడు అనేక విశ్లేషణ లు వెళ్లుడయ్యాయి. చంద్రబాబు అరెస్టు వెనుక బిజెపి పెద్దల హస్తం ఉందనే ప్రచారంతో తమ్ముళ్లు చాలా ఉక్రోషంతో ఊగిపోతున్నారు. అందువల్ల కూటమిలో బలమైన టిడిపి శ్రేణులు ‌ బిజెపికి చిత్తశుద్ధితో ఓట్లు వేయించారా లేదా అనే అనుమానాలు ఉన్నాయి. బిజెపి పోటీ చేసిన సీట్ల లో ఎన్ని గెలుస్తుందనే దానిపై చింతా మోహన్ తాజాగా వ్యాఖ్యలు చేశారు.
సీఎం జగన్ శుక్రవారం విదేశాల నుంచి రాష్ట్రానికి రానున్నారు. ఆయన లండన్ లో బయలుదేరుతూనే మళ్లీ అధికారానికి  వస్తున్నామని ట్వీట్ చేశారు. పోలింగ్ సరళిని బట్టి వైసిపి కి 35 స్థానాలకు మించి రాకపోవచ్చు అంటూ టిడిపి అధినేత చంద్రబాబు మొట్టమొదటిసారి నోరు విప్పారు. నేడు ఆయన పవన్, బిజెపి నేతలతో చర్చించనున్నారు. పోలింగ్ జరిగిన తీరును బట్టి ఎన్ని స్థానాలు రావచ్చనే దానిపై లోతుగా పరిశీలిస్తున్నారు. ఇటువంటి సమయంలో బిజెపి ఒక్క సీటు గెలవడం కష్టమని చింత వ్యాఖ్యాపించారు. ఆ పార్టీ సీటులన్నీ వైసీపీ కైవసం చేసుకుంటుంది కాబట్టి తామే గలుస్తామని జగన్ ట్వీట్ చేయడం ఆసక్తిని రేపుతుంది.

మరింత సమాచారం తెలుసుకోండి:

సంబంధిత వార్తలు: