ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వస్తున్న నేపథ్యంలో సీఎం జగన్ మోహన్ రెడ్డి మళ్ళీ ఏపీకి వస్తున్నారు. దాదాపు 15 రోజులపాటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జగన్మోహన్ రెడ్డి దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఇక ఇవాళ ఏపీ గడ్డపైన అడుగుపెట్టనున్నారు జగన్మోహన్ రెడ్డి.
ఇలాంటి నేపథ్యంలోనే సీఎం జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన లండన్ ఫోటోలు సోషల్ మీడియాలో చెక్కర్లు కొడుతున్నాయి.
ఈ ఫోటోలలో సీఎం జగన్ మోహన్ రెడ్డి అచ్చం హీరో లాగా కనిపిస్తున్నాడు. టాలీవుడ్ హీరోలు కూడా జగన్మోహన్ రెడ్డి ముందు... ఏమాత్రం సరిపోరని ఈ ఫోటోలు చూస్తే మనకు అర్థమవుతుంది. 15 రోజులపాటు లండన్ లో ఉన్న జగన్మోహన్ రెడ్డి కుటుంబం... అక్కడ జాలిగా పడింది. ఎన్నికల మూడు నుంచి... బయటికి వచ్చినా జగన్... అక్కడ సాధారణ పౌరుడి లాగా... లైఫ్ ఎంజాయ్ చేశారు.
అంతేకాకుండా ఎప్పుడు వైట్ షర్ట్ వేసుకునే జగన్మోహన్ రెడ్డి... లండన్ లో మాత్రం జీన్స్ అలాగే బ్లూ షర్ట్ తో మెరిశారు. కలర్ ఫుల్ దుస్తులు వేసుకొని... లండన్ లో మెరిసారు జగన్మోహన్ రెడ్డి. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. ఇక ఈ ఫోటోలను చూసిన వైసిపి ఫ్యాన్స్... ఫుల్ జోష్లో కనిపిస్తున్నారు. మరోసారి ముఖ్యమంత్రి కాబోతున్నాడని... ఆ ఫోటోలపై కామెంట్స్ చేస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి ముందు ఏ హీరో కూడా పనికిరాదని... మరి కొందరు అంటున్నారు.
కాగా.. కోర్టు పర్మిషన్ తో మే 17వ తేదీన... అంటే ఎన్నికల పోలింగ్ పూర్తయిన నాలుగు రోజులకు... ఏపీ నుంచి లండన్ వెళ్లిపోయారు జగన్మోహన్ రెడ్డి. లండన్ పెట్టిన జగన్ మోహన్ రెడ్డి దాదాపు రెండు వారాలపాటు అక్కడే ఉన్నారు. ఇక ఇటు చంద్రబాబు నాయుడు కూడా అమెరికాకు వెళ్లారు. ఆయన మొన్న హైదరాబాద్కు వచ్చారు. పవన్ కళ్యాణ్ కూడా రష్యా దేశానికి వెళ్ళినట్లు సమాచారం.