ఎన్నో ఉద్యమాల తర్వాత 2014 వ సంవత్సరం ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన విషయం మన అందరికీ తెలిసిందే. ఇక ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత 2014 వ సంవత్సరం తెలంగాణ రాష్ట్రం లో మొదటి సారి జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో తెరాస పార్టీ తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడానికి కావలసినంత మెజారిటీని సంపాదించుకొని రాష్ట్రంలో ప్రభుత్వాన్ని నెలకొల్పింది.
ఇక ఆ తర్వాత 2019 వ సంవత్సరం జరిగిన అసెంబ్లీ ఎన్నికలలో టీఆర్ఎస్ పార్టీ మరోసారి భారీ మెజార్టీని తెచ్చుకొని రెండవ సారి తెలంగాణ లో అధికారం లోకి వచ్చింది. ఇక ఈ పది సంవత్సరాల కాలంలో కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు అధ్యక్షతన టిఆర్ఎస్ పార్టీ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన అనేక పనులను చేసింది.
ఇక కొన్ని రోజుల క్రితమే తెలంగాణ రాష్ట్రంలో 3 వ సారి అసెంబ్లీ ఎన్నికలు జరిగిన విషయం మన అందరికీ తెలిసిందే. అందులో కాంగ్రెస్ పార్టీ భారీ మెజారిటీనీ తెచ్చుకొని తెలంగాణ లో ప్రభుత్వాన్ని నెలకొల్పింది. కాంగ్రెస్ పార్టీ అధికారం లోకి వచ్చాక కొన్ని కొత్త పనులను చేయడానికి సిద్ధం అయ్యింది.
అందులో భాగంగా తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం అయినటువంటి జూన్ 2 వ తేదీన తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతాన్ని ఆవిష్కరించబోతుంది. అలాగే మరికొన్ని పనులకు కూడా చేయబోతుంది. ఇక ఈ విషయంపై సిపిఐ జాతీయ కార్యదర్శి నారాయణ తాజాగా స్పందించారు.
ఆయన తాజాగా మాట్లాడుతూ ... తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర గీతం ఆవిష్కరించనుండటం సంతోషించదగ్గ విషయం అని , కాకపోతే అధికార చిహ్నం జోలికి వెళ్లకపోవడం మంచిదని ఆయన అభిప్రాయ పడ్డారు. రేవంత్ రెడ్డి కూడా జగన్ ను ఫాలో అవుతున్నారు అని విమర్శించారు. రాజకీయ విభేదాలు ఉండొచ్చు కానీ కక్షలు ఉండకూడదు. కేసీఆర్ చేసిన ప్రతిదాన్ని రివర్స్ చేస్తే రేవంత్ తన నెత్తిన తానే చెత్త వేసుకున్నట్లు అవుతుంది అని నారాయణ చెప్పుకొచ్చారు.