ఈ మంత్రులకు డెడ్ లైన్..అన్ని ఖాళీ చేయాల్సిందే ?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ అలాగే పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు కౌంట్ డౌన్ షురూ అయింది. మరో నాలుగు రోజుల్లోనే... ఏపీలో అధికారం ఎవరిది అనేది తేలిపోనుంది. ఇప్పటికే ఎన్నికల కౌంటింగ్ కోడ్ అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. పోలింగ్ సమయంలో జరిగినట్లుగా... ఎలాంటి అల్లర్లు జరగకుండా... పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తుంది ఎన్నికల సంఘం.
ఇక కౌంటింగ్ కు సమయం దగ్గర పడుతున్న నేపథ్యంలో... తమదంటే తమది విజయమంటూ... ఇటు అధికార వైసిపి... అటు తెలుగుదేశం కూటమి పార్టీలు ధీమా వ్యక్తం చేస్తున్నాయి. చాలామంది బెట్టింగులు కూడా కాస్తున్నారు. పవన్ కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురం నియోజకవర్గంలో.... భారీ స్థాయిలో బెట్టింగులు జరుగుతున్నాయట. అయితే ఇలాంటి నేపథ్యంలో జగన్మోహన్ రెడ్డి కేబినెట్ లో పనిచేసిన... ఏపీ మంత్రులకు డెడ్ లైన్ విధించారు ఉన్నతాధికారులు.
ఏపీ మంత్రులు ఇప్పటివరకు... ఉన్నటువంటి ప్రభుత్వ కార్యాలయాలు ఖాళీ చేయాలని పాలన అధికారులు ఆదేశాలు ఇచ్చారట. వాస్తవానికి 2019 సంవత్సరంలో... అధికారంలోకి వచ్చిన జగన్... మే 30వ తేదీన ప్రమాణ స్వీకారం చేశారు. అంటే నిన్నటికే... జగన్మోహన్ రెడ్డి పాలనకు ఐదు సంవత్సరాలు పూర్తయింది. ఎన్నికలు పూర్తయ్యే వరకు ఆపద్బాంధవ ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి ఉంటారు.
అయితే... వైసీపీ మంత్రులు మాత్రం జూన్ మూడవ తేదీన.. తమ మంత్రి పదవులను కోల్పోతారు. కాబట్టి జూన్ మూడవ తేదీ లోపు... ప్రభుత్వం ఇచ్చిన వాహనాలు, పర్సనల్ సిబ్బంది, ప్రభుత్వ కార్యాలయాలను... వెనక్కి ఇవ్వాలని ఉన్నతాధికారులు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశారు. దీంతో జూన్ మూడవ తేదీ లోపు అన్ని ఖాళీ చేసేందుకు.. వైసిపి మంత్రులు ఏర్పాట్లు చేసుకుంటున్నారట. కాగా జూన్ 4వ తేదీన ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ జరగనుంది. అటు లండన్ వెళ్లిన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కూడా ఇవాళ ఏపీకి రానున్నారు.